Andhra Pradesh: మరణించింది అవ్వే కాదు.. మానవత్వం కూడా.. రాత్రి చలికి తాళలేక

|

Dec 20, 2021 | 6:52 PM

ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా కడియం మండలం కడియపులంక పంచాయతీ పరిధిలో విషాదం చోటుచేసుకుంది.

Andhra Pradesh: మరణించింది అవ్వే కాదు.. మానవత్వం కూడా.. రాత్రి చలికి తాళలేక
Grandma Died
Follow us on

ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా కడియం మండలం కడియపులంక పంచాయతీ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. ఈ ఘటన మానవత్వానికే మాయని మచ్చగా మారింది. బుర్రిలంక సుబ్బారాయుడు గుడి పక్కనున్న బస్టాండులో సుమారు వందేళ్ల వయస్సుండే వృద్దురాలు సోమవారం ఉదయం మృతి చెంది ఉంది. ఆదివారం ఉదయం ఎవరో ఆటోలో తీసుకొచ్చి జాతీయ రహదారి పక్కనున్న ఈ బస్టాండులో ఆమెను వదిలేసి వెళ్లిపోయినట్లు స్థానికులు చెబుతున్నారు. అయితే చలి తీవ్రంగా ఉండటంతో తాళలేక.. ఆ అవ్వ మృతి చెందుందినట్లు తెలుస్తుంది. స్థానిక పోలీసులు, రెవిన్యూ అధికారులు గ్రామ పంచాయతీ ద్వారా అంత్యక్రియలు జరిపించారు. అసలు వృద్దురాలిని అక్కడ వదిలి వెళ్లింది ఎవరు అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు పోలీసులు.

(సాధారణంగా టీవీ9 వెబ్‌సైట్‌లో మృతదేహాల ఫోటోలను వినియోగించము. ఈ కథనం సమాజాన్ని కదిలించాలన్న ఆలోచనతో వాడటం జరిగింది.. గమనించగలరు)

Also Read: యూట్యూబ్‌లో చూస్తూ భార్యకు డెలివరీ.. చివరకు ఊహించని విషాదాంతం

 కట్నం డబ్బుతో వరుడు పరార్‌.. వధువు చేసిన పనితో శుభం కార్డు.. కానీ