Andhra Pradesh: పిట్ట కొంచెం కూత ఘనం.. చిన్నారి ట్యాలెంట్‌కు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ ఫిదా..

|

Jul 05, 2022 | 2:52 PM

Andhra Pradesh: పిట్ట కొంచెం కూత ఘనం అనే నానుడికి నిదర్శనంగా నందలూరుకు చెందిన ఏడాదిన్నర చిన్నారిని చెప్పుకోవచ్చు.

Andhra Pradesh: పిట్ట కొంచెం కూత ఘనం.. చిన్నారి ట్యాలెంట్‌కు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ ఫిదా..
Baby
Follow us on

Andhra Pradesh: పిట్ట కొంచెం కూత ఘనం అనే నానుడికి నిదర్శనంగా నందలూరుకు చెందిన ఏడాదిన్నర చిన్నారిని చెప్పుకోవచ్చు. అతిచిన్న వయసులోనే చిన్నారి చదవాల హార్ణిక ఇండియా బుక్ అఫ్ రికార్డులో పేరు పొంది ఔరా అనిపించింది. వివరాల్లోకెళితే.. కడప జిల్లా నందలూరు మండలానికి చెందిన చదవాల హార్ణిక ఇండియా బుక్ అఫ్ రికార్డులో చోటు సంపాదించింది. నందలూరు మండలం మేజర్ గ్రామ పంచాయతీ నాగిరెడ్డి పల్లె గ్రామానికి చెందిన 1 సంవత్సరం 8 నెలలు 24 రోజులు వున్న ఈ చిన్నారి ఒక్క నిమిషంలో 24 జంతువుల బొమ్మలను త్వరగా కనిపెట్టి వాటి పేర్లను గుర్తిస్తోంది.

ఇండియా బుక్ అఫ్ రికార్డ్స్ వారు ఈ చిన్నారిని పరీక్షించి సర్టిఫికెట్, మెడల్‌ను అందజేశారు. నందలూరుకు చెందిన తల్లి చదవాల నాగజ్యోతిని రాజంపేటకు చెందిన చదవాల బానుప్రకాశ్‌తో వివాహం కాగా, వారు వృత్తి రీత్యా అమెరికాలో స్థిర పడ్డారు. వారికి ఇద్దరు కవల పిల్లలు జన్మించారు. వారిలో ఒక్కరైనా చిన్నారి చదవాల హార్ణిక తన మెదడుకు పదును పెడుతూ ఒక్క నిమిషంలో 24 జంతువుల బొమ్మలను చకచకా చెప్పేసేది. ఈ ప్రతిభను జనవరి 10 న తల్లిదండ్రులతో కలిసి ఇండియాకి రాగా ఇండియా బుక్ అఫ్ రికార్డు వారు పరీక్షించి ఫిబ్రవరి ఒకటవ తేదిన మెడల్, సర్టిఫికెట్ పంపారు. వాటిని అమెరికాకు వెళ్లిన వారి తల్లిదండ్రులకు పంపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..