మాకు గర్వంగా ఉంది.. కమలా హ్యారీస్‌కి సీఎం జగన్ అభినందనలు

అమెరికా కొత్త ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన డెమొక్రటిక్ పార్టీ నాయకురాలు కమలా హ్యారీస్‌కి ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభినందనలు తెలిపారు.

  • Tv9 Telugu
  • Publish Date - 1:11 pm, Sun, 8 November 20
మాకు గర్వంగా ఉంది.. కమలా హ్యారీస్‌కి సీఎం జగన్ అభినందనలు

YS Jagan wishes Kamala: అమెరికా కొత్త ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన డెమొక్రటిక్ పార్టీ నాయకురాలు కమలా హ్యారీస్‌కి ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభినందనలు తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్‌లో ట్వీట్ చేసిన జగన్‌.. డెమొక్రాట్స్‌ లేదా రిపబ్లికన్లు అన్న రాజకీయాలు పక్కనపెడితే.. భారతీయ సంతతికి చెందిన కమలా హ్యారీస్‌ అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఎన్నిక అవ్వడం మాకు ఆనందంగా, గర్వంగా ఉంది. కంగ్రాట్స్‌. దేవుడి ఆశీర్వాదాలు మీకు ఉంటాయని ఆశిస్తున్నా అని కామెంట్ పెట్టారు. ( తెరపైకి రజనీకాంత్‌ బయోపిక్‌.. సూపర్‌స్టార్‌గా ధనుష్‌..!)

కాగా ఓ మహిళ, ఆసియన్‌కి అమెరికా ఉపాధ్యక్ష పదవి దక్కడం ఇదే మొదటిసారి. శాన్‌ఫ్రాన్సిస్కో అటార్నీ పదవిని అధిరోహించిన తొలి మహిళగా ఆమె రికార్డు సృష్టించారు. అలాగే కాలిఫోర్నియా అటార్నీ జనరల్‌గా సేవలందించిన మహిళగా కీర్తి గడించారు. ( Bigg Boss 4: ‘బిగ్‌బాస్’‌లోకి సుమ వైల్డ్‌కార్డు ఎంట్రీ.. ప్రోమో రిలీజ్‌