Kamala Harris: నవ్వడం ఓ భోగం అన్నారు. కాని అసందర్భంగా నవ్వితే.. ఇదిగో ఇలా అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌లా నవ్వులపాలు కాక తప్పదు. వివరాల్లోకెళితే.. అమెరికా ఉపాధ్యక్షురాలు కమలాహ్యారిస్ పదే పదే వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ప్రెస్‌మీట్లలో అనవసరమైన సమయాల్లో నవ్వుతూ.. నవ్వులపాలవుతున్నారు. నాటోలో భాగమైన తూర్పు యూరప్ మిత్ర దేశాలకు మద్దతుగా కమలా హారిస్ పొలండ్ రాజధాని వార్సా వెళ్లారు. అక్కడ పోలాండ్ అధ్యక్షుడు పోలెండ్ అధ్యక్షుడు ఆండ్రెజ్ దువాతో పాటు మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఆ సమయంలో వారికి ఎదురైన ప్రశ్నకు సమాధానం చెప్తూ నవ్వేశారు.
రష్యా దాడితో ఉక్రెయిన్ వాసులు ప్రాణభయంతో దేశం దాటి వలస వెళ్తున్నారు. సర్వం కోల్పోయి, నిస్సహాయ స్థితిలో శరణార్థులుగా తరలిపోతోన్న వారి పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంటోంది. ఇప్పుడు వారిని ఆదుకునే నాథుడెవరని సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇదే విషయాన్ని అమెరికా ఉపాధ్యక్షురాలు కమలాహారిస్‌ను ప్రశ్నించగా.. ఆమె పెద్దగా నవ్వుతూ కనిపించారు. శరణార్థులకు సహకరించమని మీరు అమెరికాను అడగాలనుకుంటున్నారా..? అని పోలండ్ అధ్యక్షుడిని పాత్రికేయులు ప్రశ్నించారు. ఈ ప్రశ్నలకు ముందుగా పోలండ్ అధ్యక్షుడు సమాధానం చెప్తారేమోనని హారిస్ ఆయనవైపు చూశారు.
అనంతరం అవసరంలో ఆదుకున్న స్నేహితుడే నిజమైన స్నేహితుడని వ్యాఖ్యానిస్తూ.. కమలా హారిస్ కొన్ని క్షణాల పాటు గట్టిగా నవ్వారు. అయితే అమెరికా వారిని స్వీకరిస్తుందా..? అనే దానిపై మాత్రం ఆమె సమాధానం ఇవ్వలేదు. అక్కడి ప్రజలు అంత బాధలు ఎదుర్కొంటోన్న సమయంలో నవ్వడానికేముందంటూ ట్విటర్‌లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. 80 సంవత్సరాల్లో ఎన్నడూ చూడని ఇలాంటి మానవతా సంక్షోభం గురించి మాట్లాడేప్పుడు వేదికపై నవ్వడమేంటని నెటిజన్లు మండిపడుతున్నారు.
Kamala Harris’ lack of preparation for high-level discussions is alarming. https://t.co/BXx3yQOixQ
— Dan K. Eberhart (@DanKEberhart) March 10, 2022
Also read:
Health Tips: ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నారా? అయితే, ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..!
Telangana: అసెంబ్లీలో నవ్వులే నవ్వులు.. భట్టి విక్రమార్క కామెడీకి పడి పడి నవ్విన మంత్రి కేటీఆర్..