US President Joe Biden: ఒడిశాలో శుక్రవారం జరిగిన ఘోర రైలు ప్రమాదంపై అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్వార్తను వినగానే తన మనసు చలించిపోయిందని, ప్రమాదంలో చనిపోయినవారి కోసం యావత్ అమెరికా సమాజం సంతాపం తెలియజేస్తోందన్నారు. ఈ సందర్భంగా మరణించినవారి కుటుంబాలకు తన దేశం తరఫున సానుభూతి తెలియజేస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు.
‘భారత్‌లో జరిగిన ఘోర రైలు ప్రమాదం గురించి విని నా హృదయం ముక్కలైంది. జిల్ బైడెన్, నేను తీవ్ర దిగ్భ్రాంతి చెందాము. ఈ దుర్ఘటన కారణంగా కుటుంబ సభ్యులను కోల్పోయినవారికి, గాయపడినవవారి కోసం ప్రార్థిస్తున్నాం. భారత్, అమెరికా మధ్య ఉన్న కుటుంబ, సాంస్కృతిక విలువల్లో ఉన్న మూలాలే ఇరు దేశాలను ఏకం చేస్తున్నాయి. బాధితుల కోసం యావత్ అమెరికా సంతాపం వ్యక్తం చేస్తోంది. సహాయక చర్యలు కొనసాగుతున్నవేళ మా ఆలోచనలన్నీ బాధితుల కుటుంబాలపైనే ఉన్నాయి’ అంటూ బైడెన్ తన ప్రకటనలో పేర్కొన్నారు.
US President Joe Biden condoles the tragic #TrainAccident that took place in Balasore, Odisha pic.twitter.com/sBRQeLrQcp
— ANI (@ANI) June 4, 2023
కాగా, ఒడిశా రైలు ప్రమాదంలో ఇప్పటిలెక్కల ప్రకారం 288 మంది ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు రైలు ప్రమాదంపై అంతర్జాతీయ స్థాయి నాయకులు సైతం దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్, జపాన్ ప్రధాని ఫుమియో కిషిదా, ఐరాస జనరల్ అసెంబ్లీ అధ్యక్షుడు కోరోసి సహా పలు దేశాల అధినేతలు, ప్రముఖులు సంతాపం ప్రకటించారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..