జో బిడెన్ పై ట్రంప్ సెటైర్లు, అలా జరిగితే చైనా అంటూ….

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తాను ఓడిపోయి..తన ప్రత్యర్థి, డెమొక్రాట్ అభ్యర్థి జో బిడెన్ గెలిస్తే చైనా పండగ చేసుకుంటుందని అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. అప్పుడు అతడిని ఆ దేశం 'లవ్' చేస్తుందని సెటైర్ వేశారు.

జో బిడెన్ పై ట్రంప్ సెటైర్లు, అలా జరిగితే చైనా అంటూ....
Follow us
Umakanth Rao

| Edited By: Anil kumar poka

Updated on: Aug 08, 2020 | 1:45 PM

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తాను ఓడిపోయి..తన ప్రత్యర్థి, డెమొక్రాట్ అభ్యర్థి జో బిడెన్ గెలిస్తే చైనా పండగ చేసుకుంటుందని అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. అప్పుడు అతడిని ఆ దేశం ‘లవ్’ చేస్తుందని సెటైర్ వేశారు. జో బిడెన్ ని నిద్రపోతున్న వ్యక్తిగా వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. బిడెన్ అధ్యక్షుడైతే చైనీయులే అమెరికాను పరిపాలిస్తారని అన్నారు. చైనా మాదిరే ఇరాన్ కూడా తాను ఎన్నికల్లో ఓడిపోవాలని కోరుకుంటోందని, కానీ తను గెలిచిన పక్షంలో ఆ దేశంతో త్వరగా ఒప్పందాలు కుదుర్చుకుంటానని ఆయన చెప్పారు. అలాగే నార్త్ కొరియాతో కూడా అన్నారు. కాగా 2016 లో తాను ఎన్నికల్లో గెలవకపోయి ఉంటే.. నార్త్ కొరియాతో అమెరికా యుధ్ధం చేయవలసివచ్ఛేదన్నారు. కానీ ఇప్పుడు ఆ దేశంతో సంబంధాలను కొనసాగించాలనుకుంటున్నట్టు ట్రంప్ తెలిపారు.

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో చైనా జోక్యం చేసుకుంటే అది ముప్పే అవుతుందని ట్రంప్ పేర్కొన్నారు. మెయిల్-ఇన్-బ్యాలట్ ను ఏ విదేశీ శక్తి అయినా.. రష్యా గానీ, చైనా లేదా ఇరాన్ లేక నార్త్ కొరియా రిగ్గింగ్ చేయవచ్చు అని ట్రంప్ తెలిపారు.