ప్రపంచంలోని అతి పెద్ద బిల్డింగ్ అతి తక్కువ ధరకే అమ్మకం

ఒకప్పుడు ప్రపంచంలోనే 11 నెలల పాటు అతి పెద్ద బిల్డింగ్‌గా పేరుగాంచిన క్రిస్లర్ బిల్డింగ్ ఇప్పుడు అమ్మకానికి అందుబాటులో ఉంది. ఇంత ఘనత కలిగిన ఈ బిల్డింగ్‌ను ప్రస్తుత యజమానులు కేవలం 15 కోట్ల డాలర్లు (సుమారు రూ.1050 కోట్లు)కే అమ్మేస్తున్నారు. న్యూయార్క్ సిటీలోని మన్‌హటన్‌లో ఈ బిల్డింగ్కు ఆర్ట్ డెకో మాస్టర్‌పీస్‌గా పేరుంది. ఈ బిల్డింగ్‌పై భారీ పెట్టుబడి పెట్టిన అబూదాబీకి చెందిన ముబదలా కంపెనీకి భారీ నష్టం వాటిల్లనుంది. 2008లో ఈ బిల్డింగ్‌లోని 90 […]

  • Tv9 Telugu
  • Publish Date - 4:22 pm, Mon, 11 March 19
ప్రపంచంలోని అతి పెద్ద బిల్డింగ్ అతి తక్కువ ధరకే అమ్మకం

ఒకప్పుడు ప్రపంచంలోనే 11 నెలల పాటు అతి పెద్ద బిల్డింగ్‌గా పేరుగాంచిన క్రిస్లర్ బిల్డింగ్ ఇప్పుడు అమ్మకానికి అందుబాటులో ఉంది. ఇంత ఘనత కలిగిన ఈ బిల్డింగ్‌ను ప్రస్తుత యజమానులు కేవలం 15 కోట్ల డాలర్లు (సుమారు రూ.1050 కోట్లు)కే అమ్మేస్తున్నారు. న్యూయార్క్ సిటీలోని మన్‌హటన్‌లో ఈ బిల్డింగ్కు ఆర్ట్ డెకో మాస్టర్‌పీస్‌గా పేరుంది. ఈ బిల్డింగ్‌పై భారీ పెట్టుబడి పెట్టిన అబూదాబీకి చెందిన ముబదలా కంపెనీకి భారీ నష్టం వాటిల్లనుంది. 2008లో ఈ బిల్డింగ్‌లోని 90 శాతం వాటాను 80 కోట్ల డాలర్లకు ఈ సంస్థ కొనుగోలు చేసింది.

అయితే ఈ బిల్డింగ్ ఉన్న స్థలం మాత్రం వీళ్లది కాదు. దీనికోసం ప్రతి ఏటా అద్దె చెల్లిస్తున్నారు. వీళ్లు కొనుగోలు చేసినప్పుడు 77 లక్షల డాలర్లుగా ఉన్న ఈ అద్దె.. 2018లో 3.2 కోట్ల డాలర్లకు చేరింది. 2028 నాటికి ఇది 4.1 కోట్లకు చేరనుంది. దీంతో ఈ పదేళ్లలో ఈ బిల్డింగ్ ద్వారా వచ్చిన ఆదాయం చాలా వరకు అద్దెకే చెల్లించాల్సి వచ్చింది. అంతేకాదు ఈ బిల్డింగ్‌లో ప్రస్తుతం 4 లక్షల చదరపు అడుగుల స్థలం ఖాళీగానే ఉంది. 1930లో ఈ క్రిస్లర్ బిల్డింగ్‌ను నిర్మించారు. 319 మీటర్ల పొడవున్న ఈ బిల్డింగ్ అప్పట్లో ప్రపంచంలోనే అతి ఎత్తయిన భవనంగా పేరు గాంచింది.