New York: ఏటా 1-2 మిల్లీ మీటర్లు కుంగిపోతున్న న్యూయార్క్‌.. తాజా సర్వేలో షాకింగ్ నిజం..

|

May 19, 2023 | 9:42 PM

న్యూ యార్క్‌ సిటీ డేంజర్‌ జోన్‌లో ఉంది. ఏ క్షణం పేకమేడలా కుప్పకూలుతుందో చెప్పలేని పొజిషన్‌.. పర్యావరణ మార్పు, పెరుగుతున్న సముద్ర మట్టాలు, నగరంలోని ఆకాశ హర్మ్యాల బరువు.. ఈ మూడూ న్యూ యార్క్‌పై హెవీ టెన్షన్‌ పెడుతున్నాయి. ఇప్పటికే ప్రతి యేటా 2 మిల్లీమీటర్ల మేర ఈ మహానగరం కుంగుతోంది.

New York: ఏటా 1-2 మిల్లీ మీటర్లు కుంగిపోతున్న న్యూయార్క్‌.. తాజా సర్వేలో షాకింగ్ నిజం..
New York Is Sinking
Follow us on

న్యూ యార్క్‌ సిటీ డేంజర్‌ జోన్‌లో ఉంది. ఏ క్షణం పేకమేడలా కుప్పకూలుతుందో చెప్పలేని పొజిషన్‌.. పర్యావరణ మార్పు, పెరుగుతున్న సముద్ర మట్టాలు, నగరంలోని ఆకాశ హర్మ్యాల బరువు.. ఈ మూడూ న్యూ యార్క్‌పై హెవీ టెన్షన్‌ పెడుతున్నాయి. ఇప్పటికే ప్రతి యేటా 2 మిల్లీమీటర్ల మేర ఈ మహానగరం కుంగుతోంది. 2100కల్లా 500 మిల్లీమీటర్ల నుంచి 1500 మిల్లీమీటర్ల మేర కుంగుబాటు ఉంటుందని అంచనా. సైంటిస్టులు చెబుతున్నట్లు.. న్యూ యార్క్‌ కూలిపోతుందా.. అదే జరిగితే పరిస్థితేంటి.. అసలు న్యూ యార్క్‌కు ఈ దారుణ స్థితి ఎందుకొచ్చింది? అంటే చాలా కారణాలే కనిపిస్తున్నాయి.

తాజాగా పరిశోధనల ప్రకారం.. న్యూయార్క్ ఏటా 1-2 మిల్లీ మీటర్ల వేగంతో కుంగుతుంది. మాన్‌హాటన్‌, బ్రూక్లిన్‌, క్వీన్స్‌
నాలుగు చతురస్రాకార గ్రిడ్‌లు ఎక్కువగా ప్రభావితం అవుతున్నాయని తెలిపారు. దీని వల్ల పది లక్షల భవనాలు, లక్షల మందికి ముంపు ముప్పు పొంచి ఉందని అంచనా వేస్తున్నారు పరిశోధకులు. ఈ కారణంగానే ప్రతి యేటా న్యూయార్క్‌కు వరదల పోటు వస్తుందంటున్నారు. అయితే, న్యూ యార్క్‌ను కాపాడేందుకు కొత్త వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు పరిశోధకులు, ప్రభుత్వాలు. పది లక్షల కంటే ఎక్కువ భవనాలు ఉండటంతో.. భూమిపై భారం ఎక్కవ అవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఏ క్షణం చేతులెత్తేసినా చాప్టర్ క్లోజ్ అంటున్నారు. భూగర్బ జలాలు వెలికితీత, పెరుగుతున్న పట్టణీకరణ, రోడ్లు, వంతెనలు, రైల్వేలు సహా అనేక కారణాలు ఈ భూమి కుంగిపోవడానికి కారణాలుగా పేర్కొంటున్నారు సైంటిస్టులు. ప్రభుత్వం మేల్కోకపోతే న్యూయార్క్ నగరం చరిత్రలో మిగిలిపోతుందని హెచ్చరిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..