డాలస్‌లో ఘనంగా జరుగుతున్న నాట్స్ సంబరాలు

అమెరికాలోని డాలస్‌లో 6వ తెలుగు సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. మే 24, 25, 26 తేదీల్లో మూడురోజులపాటు నిర్వహిస్తోన్న ఈ వేడుకకు అమెరికాలోని తెలుగు ప్రజలతోపాటు, ఇండియా నుంచి కూడా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరవుతున్నారు. వీకెండ్ వెకేషన్‌కు ఎక్కడికెళ్లాలని ఆలోచిస్తున్న వాళ్లందరికీ నాట్స్ సంబరాలు మంచి వేదిక అంటున్నారు నిర్వాహకులు. అంతకుమించిన ఫన్ ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చంటున్నారు. ఈ వేడుకలకు యూఎస్ నలుమూలలనుంచి తెలుగు వాళ్లు హాజరవుతున్నారని నిర్వాహకులు చెబుతున్నారు. తొలిరోజు వేడుకలో భారీ […]

డాలస్‌లో ఘనంగా జరుగుతున్న నాట్స్ సంబరాలు
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: May 26, 2019 | 8:51 AM

అమెరికాలోని డాలస్‌లో 6వ తెలుగు సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. మే 24, 25, 26 తేదీల్లో మూడురోజులపాటు నిర్వహిస్తోన్న ఈ వేడుకకు అమెరికాలోని తెలుగు ప్రజలతోపాటు, ఇండియా నుంచి కూడా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరవుతున్నారు.

వీకెండ్ వెకేషన్‌కు ఎక్కడికెళ్లాలని ఆలోచిస్తున్న వాళ్లందరికీ నాట్స్ సంబరాలు మంచి వేదిక అంటున్నారు నిర్వాహకులు. అంతకుమించిన ఫన్ ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చంటున్నారు. ఈ వేడుకలకు యూఎస్ నలుమూలలనుంచి తెలుగు వాళ్లు హాజరవుతున్నారని నిర్వాహకులు చెబుతున్నారు.

తొలిరోజు వేడుకలో భారీ ఎత్తున ఎన్నారైలు, తెలుగు ప్రముఖులు నాట్స్ సంబరాల్లో సందడి చేశారు. 6వేలకు పైగా తెలుగు ప్రజలు ఈ వేడుకలో పాల్గొన్నారు. తొలిరోజు వేడుకకు తెలుగు చిత్రసీమకు చెందిన ప్రముఖ నటులు హీరో సాయి ధరమ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, సాయి కుమార్, గిరిధర్, జెమిని సురేష్, సంగీత ప్రముఖులు ఆర్పీ పట్నాయక్, మనో, ఎంఎం కీరవాణి, మిమిక్రీ జితేందర్ హాజరై సందడి చేశారు.