US Supermarket Shooting: అమెరికాలో రెచ్చిపోయిన దుండగులు.. సూపర్‌ మార్కెట్‌ వద్ద కాల్పులు.. 10 మంది మృతి

|

Mar 23, 2021 | 9:31 AM

US Supermarket Shooting: అమెరికాలో వరుసగా కాల్పులు చోటు చేసుకుంటున్నాయి. దండగులు జరుపుతున్న కాల్పుల్లో చాలా మంది మృతి చెందుతున్నారు..

US Supermarket Shooting: అమెరికాలో రెచ్చిపోయిన దుండగులు.. సూపర్‌ మార్కెట్‌ వద్ద కాల్పులు.. 10 మంది మృతి
Us Supermarket Shooting
Follow us on

US Supermarket Shooting: అమెరికాలో వరుసగా కాల్పులు చోటు చేసుకుంటున్నాయి. దండగులు జరుపుతున్న కాల్పుల్లో చాలా మంది మృతి చెందుతున్నారు. తాజాగా అమెరికాలోని కొలరాడో రాష్ట్రంలోని ఓ సూపర్‌ మార్కెట్‌ వద్ద దుండగులు జరిగిన కాల్పుల్లో పోలీసు అధికారు సహా 10 మంది వరకు మృతి చెందినట్లు తెలుస్తోంది. అయితే మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం కనిపిస్తోంది. కారణాలేమి చెప్పకుండా దుండగులు విచక్షణరహితంగా సూపర్‌ మార్కెట్లో ప్రవేశించి కాల్పులకు తెగబడినట్లు తెలుస్తోంది. బౌల్డర్‌ పోలీసు సీఎండీఆర్‌. కెర్రీ యమగుచి మీడియాతో మాట్లాడుతూ…ఈ ఘటనలో ఒకరిని అదపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నామని అన్నారు. అయితే సూపర్‌ మార్కెట్‌ యజమాని మాట్లాడుతూ..ముగ్గురు సూపర్‌ మార్కెట్‌ వద్దకు వచ్చి కాల్పులు జరిపారని, ఇద్దరు పార్కింగ్‌ స్థలంలో, ఒకరు డోర్‌ వద్ద ఉన్నాడని తెలిపారు. ఈ ఘటనలో చాలా మంది వరకు మృతి చెందినట్లు తెలుస్తోంది. అయితే ఘటన స్థలానికి చేరుకున్న భద్రత సిబ్బంది అప్రమత్తమయ్యారు. దుండగుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. వరుస కాల్పులతో యూఎస్‌లో భయాందోళన రేకెత్తిస్తోంది.

కాగా, గత రెండు రోజుల కిందట కూడా ఓ మసాజ్‌ పార్లర్లపై గుర్తు తెలియని దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో 8 మంది వరకు మృతి చెందారు. మృతుల్లో ఎక్కువగా మహిళలు ఉన్నారు. ఈ ఘటనలో ఒకరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇలా దుండగుల వరుసగా రెచ్చిపోతుండటంతో భయాందోళన నెలకొంది. దుండగులు పాల్పుల్లో ఇప్పటికే చాలా మంది మృతి చెందారు.

సూపర్‌ మార్కెట్ ప్రాంతాన్ని ఆధీనంలోకి తీసుకున్న భద్రత సిబ్బంది

కాగా, కాల్పులు జరిగిన సూపర్‌ మార్కెట్‌ ప్రాంతాన్ని భద్రత సిబ్బంది ఆధీనంలోకి తీసుకున్నారు. ఆ ప్రాంతాన్ని పోలీసులు చుట్టుముట్టారు. దుండగుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఈ ఘటనలో చాలా మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. అలాగే సూపర్ మార్కెట్ ఆవరణలో అంబులెన్స్‌లను సిద్ధంగా ఉంచారు. సూపర్ మార్కెట్‌లో చిక్కుకుపోయిన వారిని సురక్షితంగా బయటికి తరలించడానికి అందుబాటులో ఉన్న మార్గాలను వినియోగించారు. కొందరిని రక్షించగలిగారు. ఈ రెస్క్యూ ఆపరేషన్ రాత్రి 9 గంటల వరకు కొనసాగింది. కాల్పులకు పాల్పడిన దుండగుల్లో ఒకరిని అరెస్టు చేశారు. అయితే దుండగుడిని అరెస్టు చేసే ప్రయత్నంలో అతని గాయపర్చాల్సి వచ్చిందని బౌల్డర్‌ పోలీసు సీఎండీఆర్‌. కెర్రీ యమగుచి తెలిపారు. అరెస్టు చేసిన అతన్ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించి విచారిస్తున్నారు.

ఇవీ చదవండి:

Donald Trump: మరో సంచలనానికి తెర లేపిన అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ట్విట్టర్, ఫేస్‌బుక్ టార్గెట్‌గా..

భగభగ మండే జ్వాలా ద్వీపం ! ఎరుపెక్కిన లావాను వెదజల్లుతున్న అగ్నిపర్వతం, డ్రోన్ తీసిన దృశ్యం !