Havana Syndrome‌: అఫ్గానిస్తానీయుల తరలింపులో అంతు చిక్కని సమస్య.. అదృశ్య శక్తులు దాడి చేస్తున్నాయంటున్న అమెరికా అధికారులు..

|

Aug 26, 2021 | 12:21 PM

ఏం జరుగుతుందో తెలియదు..? ఎవరు చేస్తున్నారో తెలియదు..? దాడి జరుగుతుంది.. దాడి చేసింది ఎవరో కనిపించరు.. రక్తం చిందుతుంది.. రక్తం కనిపించదు.. మెదడు దెబ్బ తింటుంది.. అంతు చిక్కని సమస్య..అమెరికా దౌత్యవేత్తలను వెంటాడుతున్న వింత దాడి..

Havana Syndrome‌: అఫ్గానిస్తానీయుల తరలింపులో అంతు చిక్కని సమస్య.. అదృశ్య శక్తులు దాడి చేస్తున్నాయంటున్న అమెరికా అధికారులు..
Havana Syndrome
Follow us on

అమెరికా దౌత్యవేత్తలను ఓ ప్రత్యేమైన సిండ్రోమ్‌ తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. అది ఎందుకు వస్తోందో అగ్రరాజ్యం శాస్త్రవేత్తలకు అంతుపట్టడంలేదు. ఎవరో తమపై కుట్ర పన్నుతున్నారన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ వియత్నాం పర్యటన సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ సిండ్రోమ్‌ కారణంగానే కొన్ని గంటలపాటు కమలా హరిస్ వియత్నాం పర్యటన ఆలస్యమైంది. వియత్నాంలోని దౌత్య కార్యాలయం నుంచి ఓ వ్యక్తిని అత్యవసరంగా చికిత్స నిమిత్తం తరలించాల్సి వచ్చింది.

అయితే విమాన ప్రయాణాలు జరుగుతున్నప్పుడు పీడించే ఈ సమస్యను ‘హవానా సిండ్రోమ్‌’ అని అంటారు. 2016లో తొలిసారి దీనిని క్యూబాలో హవానా నగరంలోని అమెరికా దౌత్యకారాలయ సిబ్బందిలో ఈ సమస్యను అక్కడి అధికారులు గుర్తించారు. తొలిసారి హవానాలో బయటపడటంతో ఆ పేరుతోనే పిలుస్తున్నారు. ఈ ‘హవానా సిండ్రోమ్‌’లో ముందుగా మెదడుపై ఏదో తెలియని తీవ్రమైన ఒత్తిడి కలుగుతుంది. ఆ తర్వాత కందిరీగల దండు తమ వద్ద తిరుగుతున్నట్లు చప్పుడు వినిపిస్తుంటుంది.

ఈ శబ్దం భరించలేని స్థాయిలో ఉంటుంది. దీని ప్రభావానికి గురైన వ్యక్తికి వికారం, వాంతులు చేసుకుంటారు. అంతేకాదు, విపరీతంగా అలసటతో పాటు.. ఏ విషయాన్ని సరిగ్గా గుర్తుపెట్టుకోలేరు. ఈ సమస్య కొద్ది సమయం పాటు ఉన్నప్పటికీ.. ఆ సమయంలో వారు ఏం చేస్తున్నారో కూడా అర్థం కాని పరిస్థితి ఉంటుందని ‘హవానా సిండ్రోమ్‌’ ఎదుర్కొన్న అధికారులు అభిప్రాయపడుతున్నారు.

క్యూబాలో ఈ ప్రభావానికి లోనైన వారిలో మూడోవంతు మందికి అధికారులకు వినికిడి శక్తి పాక్షికంగా దెబ్బతిందని వారు వెల్లడించారు. వారి మెదడును స్కాన్‌ చేసిన అమెరికా వైద్యులు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఈ ‘హవానా సిండ్రోమ్‌’ బారిన పడిన వారి మెదడు కొద్దిబాగం దెబ్బతిన్నట్లు డాక్టర్లు గుర్తించారు. సాధారణంగా ఏదైనా భారీ ప్రమాదానికి గురైతే కానీ ఆ స్థాయిలో మెదడు దెబ్బతినదని అంటున్నారు.

కొన్ని రకాల ఉద్యోగులు మాత్రమే ఈ సిండ్రోమ్‌ బారిన పడుతున్నారు. క్యూబా, చైనా దౌత్యకార్యాలయాల్లో పనిచేసే వారే ఎక్కువగా ఉన్నారు. దౌత్యవేత్తలు, గూఢచారులు, సైనిక సిబ్బంది, సీఐఏ సిబ్బంది, విదేశాగ శాఖ సిబ్బంది ఈ జాబితాలో కనిపిస్తున్నారు. గత ఐదేళ్ల నుంచి దాదాపు 200 మంది దీని బారిన పడి ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు.

మైక్రోవేవ్‌ తరంగాల సాయంతో గుర్తుతెలియని ప్రత్యర్థులు దాడులు చేస్తున్నారని అమెరికా ఆరోపిస్తోంది. చైనా, ఆస్ట్రియా, పోలాండ్‌, రష్యాలోని అమెరికా దౌత్య సిబ్బంది ఈ సిండ్రోమ్‌ బాధితుల జాబితాలో ఉన్నారు. కొందరు కెనడా దౌత్యవేత్తలు కూడా ఈ సిండ్రోమ్‌ బారినపడినట్లు సమాచారం.

2019లో కారులో ఉన్న ఒక అమెరికా సైనిక అధికారికి ఒక్కసారిగా తీవ్ర వికారంగా అనిపించింది. అదే సమయంలో వెనుకసీటులో ఉన్న అతడి రెండేళ్ల కుమారుడు కూడా విపరీతంగా ఏడవటం మొదలు పెట్టాడు. వారు కారు నుంచి బయటకు వచ్చిన కొద్దిసేపటి తర్వాత ఆ లక్షణాలు తగ్గాయి. అతని కుమారుడు కూడా కుదుట పడ్డాడు. ఈ ఘటన అమెరికా ప్రభుత్వాన్ని కలవర పర్చింది.

కమలా హారిస్‌ పర్యటన జాప్యం..

అఫ్గానిస్తానీయులను తరలించే పనిని భూజాలపై ఎత్తున్న అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ వివిధ దేశాలతో చర్చలు జరుపుతున్నారు. ఈ సందర్భంగా ఆసియా దేశాల్లో పర్యటిస్తున్నారు కమలా హారిస్. ఇందులో భాగంగా వియత్నాం పర్యటనకు వెళ్లిన సమయంలో కమలా వెంట ఉన్న అధికారులపై హవానా సిండ్రోమ్‌ ప్రభావం కనిపించింది. దీంతో ఆమె ప్రయాణం కొన్ని గంటలపాటు ఆలస్యంగా సాగింది. వియత్నాంలోని అమెరికా దౌత్య సిబ్బంది హవానా సిండ్రోమ్‌ వంటి సమస్య బారిన పడినట్లు తేలింది. ఈ సారి దౌత్య సిబ్బంది ఇంటి వద్ద ఈ పరిస్థితి తలెత్తింది. గతంలో ఇక్కడి సిబ్బంది ఈ సమస్యతో ఇబ్బంది పడ్డారు.  దీంతో ఒక్కసారి అప్రమత్తమైన అమెరికా సిబ్బంది కమలా పర్యటన ఏర్పాట్లను మరింత కట్టుదిట్టం చేశారు. అయితే హవానా సిండ్రోమ్‌‌ను చైనా, క్యూబా దేశాలు ప్రయోగిస్తున్నాయని అగ్రరాజ్యంలోని అధికారులు ఆరోపిస్తున్నారు.

ఇవి కూడా చదవండి: Viral Video: హడావిడిగా రైల్వే గేట్ దాటడానికి ప్రయత్నించాడు.. అప్పుడేం జరిగిందో చూస్తే.. మీరు కూడా ఆశ్చర్యపోతారు..

Hair Smuggling: వెంట్రుకలే కదా అని తీసిపడేయకండీ.. ఆ కురులే వారిని కుబేరులను చేస్తున్నాయి.. ఇది ఎలానో తెలుసుకోండి..