అభిశంసనపై నేడు ఓటింగ్..నిలిపివేయాలంటూ ట్రంప్ ఆగ్రహం
అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌పై అభిశంసన అభియోగాలపై యూఎస్ ప్రతినిధుల సభలో ఇవాళ ఓటింగ్ జరగనుంది. ఈ విషయాన్ని స్వయంగా స్పీకర్ నాన్సీ పెలోసీ ప్రకటించారు. ఐతే తన అభిశంసనపై ఓటింగ్ చేపట్టనున్నట్లు స్పీకర్ ప్రకటించడంపై మండిపడ్డారు ట్రంప్. అభిశంసన ప్రక్రియను నిలిపివేయాలంటూ..ఆగ్రహంతో స్పీకర్‌కు 6 పేజీల లేఖ లేశారు. తాను ఎలాంటి నేరాలకూ పాల్పడలేదని..రాజ్యాంగ విరుద్ధంగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. అమెరికా చరిత్రలో ఇలాంటి ఘటన ఎప్పుడూ జరగలేదని..ప్రజాస్వామ్యంపై బహిరంగ యుద్దం ప్రకటిస్తున్నారని విమర్శించారు. అభిశంసన […]
అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌పై అభిశంసన అభియోగాలపై యూఎస్ ప్రతినిధుల సభలో ఇవాళ ఓటింగ్ జరగనుంది. ఈ విషయాన్ని స్వయంగా స్పీకర్ నాన్సీ పెలోసీ ప్రకటించారు. ఐతే తన అభిశంసనపై ఓటింగ్ చేపట్టనున్నట్లు స్పీకర్ ప్రకటించడంపై మండిపడ్డారు ట్రంప్. అభిశంసన ప్రక్రియను నిలిపివేయాలంటూ..ఆగ్రహంతో స్పీకర్‌కు 6 పేజీల లేఖ లేశారు. తాను ఎలాంటి నేరాలకూ పాల్పడలేదని..రాజ్యాంగ విరుద్ధంగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. అమెరికా చరిత్రలో ఇలాంటి ఘటన ఎప్పుడూ జరగలేదని..ప్రజాస్వామ్యంపై బహిరంగ యుద్దం ప్రకటిస్తున్నారని విమర్శించారు. అభిశంసన చర్యతో ముందుకు వెళితే మీ అధికారాన్ని దుర్వినియోగం చేసినట్లేనని..రానున్న ఎన్నికల్లో డెమోక్రాట్లకు ప్రజలే బుద్ది చెబుతారని హెచ్చరించారు.
ఐతే ట్రంప్ లేఖపై స్పందించిన స్పీకర్ నాన్సీ పెలోసీ..ప్రెసిడెంట్ లెటర్‌ను పూర్తిగా చదవలేదన్నారు. దేశ చరిత్రలో అత్యంత కీలకమైన ఈ దశలో మన రాజ్యాంగాన్ని బలపరుస్తామని చేసిన ప్రమాణాన్ని గౌరవించి తీరాలన్నారు. ట్రంప్‌పై రెండు అభిశంసన అభియోగాలపై ఓటింగ్ జరుగుతుందని తెలిపారు. అభిశంసన దర్యాప్తుకు సహకరించలేదని..సాక్ష్యులను అడ్డుకున్నారనేది ఒకటైతే..జో బిడెన్ మీద దర్యాప్తు జరిపించాలంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడిపై ఒత్తిడి తెచ్చారనేది రెండో అభియోగం. ఈ రెండు అభియోగాలపై ఇవాళ జరిగే ఓటింగ్‌లో ట్రంప్ అభిశంసనకు గురవుతారని..ఆ తర్వాత సెనేట్‌లో విచారణ జరుగుతుందని భావిస్తున్నారు డెమోక్రాట్స్. ఇదే జరిగితే అమెరికా చరిత్రలో ప్రతినిధుల సభలో అభిశంసనకు గురైన మూడో అధ్యక్షుడిగా ట్రంప్ నిలిచిపోతారు. ఇక సెనేట్‌లో రిపబ్లికన్లు ఆధిక్యంలో ఉన్నారు. దీంతో యూఎస్ ప్రతినిధుల సభలో ట్రంప్ అభిశంసనకు గురైనా..సెనేట్‌లో ఏం జరుగుతందనేది ఆసక్తిగా మారింది.