US Police: కోడిని అరెస్ట్‌ చేసిన పోలీసులు.. ఎందుకో తెలిస్తే షాకవుతారు..!

|

Feb 05, 2022 | 11:23 AM

US Police:  ఏదైనా సంఘటన జరిగితే పోలీసులు విచారణ చేపడతారు. అందుకు సంబంధించిన నిందితులను అరెస్టు చేస్తుంటారు. అలాగే అనుమానిత..

US Police: కోడిని అరెస్ట్‌ చేసిన పోలీసులు.. ఎందుకో తెలిస్తే షాకవుతారు..!
Follow us on

US Police:  ఏదైనా సంఘటన జరిగితే పోలీసులు విచారణ చేపడతారు. అందుకు సంబంధించిన నిందితులను అరెస్టు చేస్తుంటారు. అలాగే అనుమానిత వ్యక్తులను సైతం పోలీసులు అరెస్టు చేస్తుంటారు. కానీ ఇక్కడ ఎవ్వరిని అరెస్టు చేశారో తెలిస్తే షాకవుతారు. పోలీసులు ఓ కోడిని అరెస్టు చేశారు. కోడిని అరెస్టు చేయడం ఏంటని అనుకుంటున్నారా..? ఇది నిజమే. ఈ విషయం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ ఘటనల అమెరికాలో చోటు చేసుకుంది. అనుమానస్పందంగా తిరుగుతున్న ఓ కోడిని పెంటగాన్‌ భద్రతా అధికారులు అదుపులోకి తీసుకున్నారు.  పూర్తి వివరాల్లోకి వెళితే.. భారీ భద్రత ఉండే అమెరికా రక్షణ విభాగం పెంటగాన్ కార్యాలయ పరిసర ప్రాంతంలో ఆహారం కోసం అటూ ఇటూ తిరుగుతున్న ఓ కోడి అనుమానస్పందంగా తిరుగుతుందంటూ కొందరు పోలీసు ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని కోడిని అరెస్టు చేశారు. దొంగతనాలు, హత్యలు, ఇతర క్రైమ్‌ ఘటనలకు సంబంధించి అరెస్టు చేయడం చూశాం కానీ.. ఇలా కోడిని అరెస్టు చేయడం ఆశ్చర్యంగా ఉంది. తిండి గింజల కోసం తిరుగుతున్న కోడిని అనుమానస్పదంగా భావించి అరెస్టు చేసి తీసుకెళ్లడం వింతగా అనిపిస్తోంది.

ఇవి కూడా చదవండి:

PM KISAN Samman Nidhi Yojana: రైతుల ఖాతాల్లో పీఎం కిసాన్‌ డబ్బులు ఎప్పుడు వస్తాయంటే..!

Srinagar Encounter: జమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదుల హతం..