Bank Deposits: ఓ కుటుంబం ఖాతాలోకి పొర‌పాటున 50 బిలియ‌న్ డాలర్లను బదిలీ చేసిన బ్యాంకు.. తర్వాత ఏం జరిగిందంటే..?

|

Jun 30, 2021 | 5:51 AM

Bank Deposits: బ్యాంకుల్లో పని చేసే సిబ్బంది వల్ల అప్పుడప్పుడు కొన్ని పొరపాట్లు జరుగుతుంటాయి. ఒకరి ఖాతాలో వేసే డబ్బులు మరొకరి ఖాతాల్లో వేసిన సందర్భాలు కూడా..

Bank Deposits: ఓ కుటుంబం ఖాతాలోకి పొర‌పాటున 50 బిలియ‌న్ డాలర్లను బదిలీ చేసిన బ్యాంకు.. తర్వాత ఏం జరిగిందంటే..?
Follow us on

Bank Deposits: బ్యాంకుల్లో పని చేసే సిబ్బంది వల్ల అప్పుడప్పుడు కొన్ని పొరపాట్లు జరుగుతుంటాయి. ఒకరి ఖాతాలో వేసే డబ్బులు మరొకరి ఖాతాల్లో వేసిన సందర్భాలు కూడా అప్పుడప్పుడు జరుగుతుండటం చూసే ఉంటాము. కానీ కొన్ని సార్లు వారు చేసే పొర‌పాట్ల వ‌ల్ల ఇత‌రుల ఖాతాల్లోకి పెద్ద మొత్తంలో డ‌బ్బు వ‌చ్చి చేరుతుంది. అలా డబ్బులు ఖాతాలో చేరగానే తీసేసుకుంటుంటారు. కానీ పొరపాటున ఓ దంపతుల ఖాతాలో వచ్చిన డబ్బులు మాత్రం తీసుకోలేదు. ఇంతకీ ఏం జరిగింది..? ఎక్కడ జరిగిందనే పూర్తి వివరాల్లోకి వెళితే..

అమెరికాలోని లూసియానా రాష్ట్రంలో ఉన్న బేటన్‌ రోగ్‌ అనే ప్రాంతానికి చెందిన డారెన్‌ జేమ్స్‌ అనే వ్యక్తి రియల్‌ ఎస్టేట్‌ ఏజెంట్‌గా పని చేస్తున్నాడు. అయితే ఆ దంప‌తుల‌కు చెందిన జాయింట్ ఖాతాలో ఇటీవ‌ల భారీ మొత్తంలో డ‌బ్బు జ‌మ అయింది. ఏకంగా 50 బిలియ‌న్ డాలర్లు (3.7 Lakh Crore) పొర‌పాటున వారి ఖాతాలో జ‌మ చేసింది బ్యాంకు. అయితే త‌మ ఖాతాలో అంత భారీ మొత్తం ఉండ‌డాన్ని గ‌మ‌నించిన జేమ్స్ వెంట‌నే బ్యాంకును సంప్రదించాడు. ఈ ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు తమ ఖాతాల్లోకి ఎలా వచ్చాయి..? తాము అయితే వేయలేదు.. అని బ్యాంకు సిబ్బందిని సంప్రదించారు. దీంతో బ్యాంకు వారు తప్పిదం జరిగిందని తెలుసుకుని తర్వాత ఆ మొత్తాన్ని వెనక్కి తీసుకున్నారు. ఇలాంటి సంద‌ర్భాల్లో బ్యాంకులో జ‌మ అయిన మొత్తాల‌ను తీసి ఖ‌ర్చు చేస్తే అమెరికా చ‌ట్టాల ప్రకారం క్రిమినల్‌ చర్యలు తీసుకుంటారు. కానీ జేమ్స్ దంప‌తులు అలా చేయ‌లేదు. ఖాతాలో ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు పడటంపై బ్యాంకు అధికారులకు తెలియజేయడంతో  జరిగిన పొరపాటును తెలుసుకుని బ్యాంకు ఆ మొత్తాన్ని వెనక్కి తీసుకుంది. ఇక 2019లో అమెరికాకు చెందిన ఓ మహిళా ఖాతాలోనూ ఇలాగే పొరపాటున నగదు జమ అయ్యింది. రూత్‌ బాలన్‌ అనే మహిళకు అక్కడి లెగసీ టెక్సాస్‌ బ్యాంకులో ఖాతా ఉంది. అందులో బ్యాంకు పొరపాటున 37 మిలియన్‌ డాలర్లను జమ చేశారు. కానీ జరిగిన పొరపాటును తెలుసుకుని వెంటనే ఆ మొత్తాన్ని వెనక్కి తీసుకున్నారు.

 

ఇవీ కూడా చదవండి

Facebook: సోషల్ మీడియా సంస్థ ఫేస్‌బుక్ సరికొత్త రికార్డు..భారీ స్థాయిలో పెరిగిన మార్కెట్ క్యాపిటలైజేషన్!

TikTok Ban: భారత్ బాటలో పాకిస్తాన్.. ఏడాదిలో రెండవసారి ఇలా చేయడం.. చైనాకు షాక్..!