ATA Celebrations 2022: ఆటా మహాసభల్లో సెలబ్రిటీల సందడి.. గోల్ఫ్‌ ఆడిన సద్గురు, రకుల్‌, కపిల్‌..

| Edited By: Anil kumar poka

Jul 04, 2022 | 11:07 AM

ATA Celebrations 2022: అమెరికా రాజధాని వాషింగ్టన్‌ డీసీ వేదికగా అమెరికా తెలుగు అసోసియేషన్ (ఆటా) 17వ మహాసభలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వాషింగ్టన్‌ డీసీలోని సువిశాలమైన వాల్టర్ ఈ వాషింగ్టన్ కన్వెన్షన్ సెంటర్‌లో జులై 1, 2, 3 తేదీల్లో జరిగే ఈ మెగా కన్వెన్షన్‌ కోసం అతిరథ మహారథులు తరలివస్తున్నారు. ఈ మహాసభల్లో పాల్గొనడానికి ఇండియా నుండి అమెరికా చేరుకుంటున్న ప్రత్యేక అతిథులతో వాషింగ్టన్ డీసీ కళకళలాడుతుంది. సద్గురు జగ్గీ వాసుదేవ్, మాజీ క్రికెటర్లు గవాస్కర్, […]

ATA Celebrations 2022: ఆటా మహాసభల్లో సెలబ్రిటీల సందడి.. గోల్ఫ్‌ ఆడిన సద్గురు, రకుల్‌, కపిల్‌..
Ata Celebrations 2022
Follow us on

ATA Celebrations 2022: అమెరికా రాజధాని వాషింగ్టన్‌ డీసీ వేదికగా అమెరికా తెలుగు అసోసియేషన్ (ఆటా) 17వ మహాసభలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వాషింగ్టన్‌ డీసీలోని సువిశాలమైన వాల్టర్ ఈ వాషింగ్టన్ కన్వెన్షన్ సెంటర్‌లో జులై 1, 2, 3 తేదీల్లో జరిగే ఈ మెగా కన్వెన్షన్‌ కోసం అతిరథ మహారథులు తరలివస్తున్నారు. ఈ మహాసభల్లో పాల్గొనడానికి ఇండియా నుండి అమెరికా చేరుకుంటున్న ప్రత్యేక అతిథులతో వాషింగ్టన్ డీసీ కళకళలాడుతుంది. సద్గురు జగ్గీ వాసుదేవ్, మాజీ క్రికెటర్లు గవాస్కర్, కపిల్ దేవ్, క్రిస్ గేల్, హీరో అడవి శేష్, నటి రకుల్ ప్రీత్ సింగ్‌, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అండ్ టీం, గాయకులు శ్రీకృష్ణ, సునీత, మనీషా, మంగ్లీ, గీత రచయితలు చంద్రబోస్, రామజ్యోగయ శాస్త్రి, శేఖర్ మాస్టర్, పద్మశ్రీ పద్మజ గారు, కూచిపూడి కళాకారుల బృందం, తనికెళ్ల భరణి, ఉపాసన కొణిదెల, యాంకర్లు శ్రీముఖి, రవి తదితరులు ఇప్పటికే వాషింగ్టన్‌ చేరుకున్నారు.

వీరితో పాటు టీఆర్‌ఎస్‌ మంత్రులు వేముల ప్రశాంత్‌ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌ రావు, మల్లారెడ్డి తదితర రాజకీయ నాయకులు అమెరికా చేరుకున్నారు. వీరికి ఆటా నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. ATA ప్రెసిడెంట్ భువనేశ్ భూజాల, కన్వీనర్ సుధీర్ బండారు, స్వయంగా ఎయిర్పోర్ట్ కి వెళ్లి అతిథులకు స్వాగతం పలుకుతున్నారు.ఆటా ఉత్సవాల్లో భాగంగా సద్గురు జగ్గీ వాసుదేవ్, కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్, క్రిస్ గేల్, రకుల్ ప్రీత్ తదితరులు గోల్ఫ్ టోర్నమెంట్లో పాల్గొన్నారు. కాగా కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్, క్రిస్ గేల్ యూత్ క్రికెట్ టోర్నమెంట్‌కు అథిథులుగా హాజరవుతున్నారు

ఇవి కూడా చదవండి

.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..