‘అమెరికన్లూ ! ఫేస్ మాస్కులు ధరించండి’.. ట్రంప్ పిలుపు
పబ్లిక్ గా మార్కెట్లకు వఛ్చి నప్పుడు ప్రజలంతా ఫేస్ మాస్కులు ధరించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పిలుపునిచ్చారు.

పబ్లిక్ గా మార్కెట్లకు వఛ్చి నప్పుడు ప్రజలంతా ఫేస్ మాస్కులు ధరించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పిలుపునిచ్చారు. సాధారణబ్రీథింగ్ ద్వారా కూడా ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 10లక్షల మందికి పైగా ప్రజలకు కరోనా సోకవచ్ఛునని భయాందోళనలు వ్యక్తమవుతున్న వేళ ఆయన ఈ సూచన చేశారు. అమెరికాలో కేవలం ఒక్క రోజే 1480 మంది కరోనా రోగులు మృతి చెందారు. అంతకుముందు ఈ సంఖ్య 1169 గా నమోదయింది. షాపింగ్ మాల్స్ వంటి చోట్ల నాన్-మెడికల్ మాస్కులు ధరించాలన్న తన సూచన పరిమిత కాలానికి మాత్రమే ఉంటుందని ట్రంప్ పేర్కొన్నారు. అంటే నా పిలుపును వారు స్వచ్ఛందంగా పాటించవచ్ఛు అన్నారాయన. ఒక వైపు వేల సంఖ్యలో కరోనా రోగులు మరణిస్తుంటే ఆయన ఇంకా ఈ విధమైన పిలుపు ఆశ్చర్యంగా ఉందని విపక్ష డెమొక్రాట్లు విమర్శిస్తున్నారు. కాగా చాలామందికి ఎలాంటి కరోనా లక్షణాలు కనబడని కారణంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు కనిపిస్తోందని ప్రముఖ సర్జన్ జీరోమ్ ఆడమ్స్ అభిప్రాయపడ్డారు. అయితే ముందు జాగ్రత్తచర్యగా సామజిక దూరం పాటించడం తప్పనిసరని అన్నారు.
ఇలా ఉండగా.. కరోనా రోగులు దగ్గినప్పుడో, తుమ్మినప్పుడో కే మాత్రమే కాకుండా.. వ్యక్తులు మాట్లాడుతున్నప్పుడు కూడా ఈ వైరస్ వ్యాపింపవచ్చునని తమ పరిశోధనల్లో ప్రాథమికంగా తెలియవచ్చిందని నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ కి చెందిన డాక్టర్ ఫోసీ తెలిపారు. ఈ మేరకు తాము జరిపిన పరిశోధనా ఫలితాలను ఆయన వైట్ హౌస్ కు ఓ లేఖ ద్వారా తెలిపారు. అటు-యూరప్ దేశాల్లో సుమారు 40 వేల మంది కరోనా కారణంగా మృత్యువాత పడ్డారు. స్పెయిన్ లో గత 24 గంటల్లో 900 డెత్ కేసులు నమోదయ్యాయి. ఇటలీలో తాజాగా 700 కేసులు నమోదైనట్టు ఆ దేశ వర్గాలు వెల్లడించాయి. అటు-సిరియా, లిబియా, యెమెన్ వంటి దేశాలకు కూడా కరోనా వైరస్ వ్యాపించే ప్రమాదం ఉందని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్స్ చెబుతున్నారు.