AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

America: విచ్చలవిడిగా తుపాకులు వాడే విధానాన్ని నియంత్రించడానికి బైడెన్ సర్కారు కసరత్తులు 

అమెరికాలో తుపాకీ సంస్కృతి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నిత్యం ఎక్కడో చోట తుపాకీ పేలుతూనే ఉంటుంది. అక్కడ తుపాకీని ఇష్టారాజ్యంగా వాడటం మామూలే.

America: విచ్చలవిడిగా తుపాకులు వాడే విధానాన్ని నియంత్రించడానికి బైడెన్ సర్కారు కసరత్తులు 
America
KVD Varma
|

Updated on: Apr 09, 2021 | 1:31 PM

Share

America: అమెరికాలో తుపాకీ సంస్కృతి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నిత్యం ఎక్కడో చోట తుపాకీ పేలుతూనే ఉంటుంది. అక్కడ తుపాకీని ఇష్టారాజ్యంగా వాడటం మామూలే. అనుమతి లేకుండా తుపాకీలను వాడటం సర్వసాధారణంగా జరిగిపోతుంటుంది. ఇప్పుడు ఈ గన్ కల్చర్ పై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రత్యేకంగా దృష్టి సారించారు. తమ దేశంలో గన్స్ అతి వాడకాన్ని నియంత్రించడానికి బైడెన్ ప్రభుత్వం కొన్ని కీలక చర్యలు తీసుకున్నట్టు వైట్ హౌస్ వర్గాలు తెలిపాయి. ‘గాన్ వైలెన్స్ పబ్లిక్ హెల్త్ ఎపడిమిక్’ పేరుతో బైడెన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో భాగంగా మాజీ ఫెడరల్ ఏజెంట్, గన్స్ నియంత్రణ వ్యవస్థకి సలహాదారుడైన డేవిడ్ చిప్ మ్యాన్ ను బీయూర్ ఆఫ్ ఆల్కహాల్, టొబాకో, ఫైర్ ఆర్మ్స్, ఎక్స్ ప్లోజివ్స్ (ఏటీఎఫ్) కు డైరెక్టర్ గా నియమించారు.

అమెరికాలో ఘోస్ట్ గన్స్ ఎక్కువగా ఉంటాయి. అంటే ఇవి రిజిస్టర్ అయినవి కావు. తుపాకీ విడిభాగాలను తీసుకుని.. ఇళ్లలోనే వాటిని తయారు చేసి ఇష్టం వచ్చినట్టు అమ్మేస్తూ ఉంటారు. ఇటువంటి తుపాకులతో కాల్పులు జరిగితే ఆ తుపాకీ ఎక్కడ తయారైందో తెలుసుకోవడం కష్టం. అందుకే ఇటువంటి అనధికారిక తుపాకుల నియంత్రణకు ఏ చర్యలు తీసుకోవాలో చెప్పాలంటూ న్యాయశాఖను బైడెన్ ఆదేశించారు. ఘోస్ట్ గన్స్ నియంత్రణకు బైడెన్ సర్కారు గట్టి చర్యలు తీసుకోవడం మొదలు పెట్టింది.

పిస్టల్ ను నేషనల్ ఫైర్ ఆర్మ్స్ చట్టం కింద నియంత్రించాలని నిర్ణయం తీసుకున్నారు. పిస్టల్ ని రైఫిల్గా మార్చే అవకాశం ఉంటుంది. ఇటీవల కాలంలో బౌల్డర్ ప్రాంతంలో జరిగిన కాల్పులు ఇటువంటి రైఫిల్ తోనే జరిగినట్టు గుర్చించారు. దీంతో వీటిపై నియంత్రణ విధించాలని నిర్ణయం తీసుకున్నారు.

తుపాకుల నియంతరంకు పూర్తి స్థాయిలో నియంత్రించడానికి బైడెన్ చేపడుతున్న చర్యలు చెత్తగా మారాల్సిన అవసరం ఉందని అంటున్నారు. అయితే, ఈ చట్టాలకు కాంగ్రెస్ లోరిపబ్లికన్ లు మద్దతు ఇవ్వడం కష్టంగానే కనపడుతోంది. ఈ ప్రతిపాదనల్లో చాల వాటికి రిపబ్లికన్లు వ్యతిరేకిస్తున్నారు. ప్రస్తుతం తుపాకుల చట్టానికి అందరి మద్దతు పొంది చట్టాలన్నీ ఆమోదం పొందేలా చేయడానికి బైడెన్ సర్కార్ వ్యూహరచనల్లో మునిగింది.

Also read: Selfie On Mars: అంతరిక్షంలో అద్భుతం.. అంగారక గ్రహంపై అద్భుత సెల్ఫీ.. రెండు రోబోలు ఒకే ఫ్రేమ్‌లో..

నడి సముద్రంలో నౌక.. చుట్టుముట్టిన సుడిగుండాలు.. ఆకాశం నుంచి అందిన సాయం.. సిబ్బందిని కాపాడిన తీరు చూస్తే షాకే