నేటి నుంచి నెల్లూరు జిల్లాలో ఫ్లెమింగో ఫెస్టివల్‌!

నెల్లూరు జిల్లాలో శుక్రవారం (జనవరి 3) నుంచి ప్రారంభమయ్యే ఫ్లెమింగో ఫెస్టివల్‌కు అధికారులు విస్తృతమైన ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో యువకులు, స్థానికులు, పర్యాటకులు పెద్ద సంఖ్యలో పాల్గొంటారు. ఈ ఫెస్టివల్ సాధారణంగా నవంబర్ మరియు జనవరి మధ్య జరుగుతుంది. పక్షుల గొప్పతనాన్ని వివరించే సాంస్కృతిక కార్యక్రమం ప్రముఖ ప్రదర్శనకారులతో జరుగుతుంది. అటవీ శాఖ సిబ్బంది సందర్శకుల కోసం సూళ్లూరుపేటలోని పులికాట్ సరస్సు, నేలపట్టు పక్షుల అభయారణ్యాలలో విస్తృత ఏర్పాట్లు చేశారు. గత సీజన్లో ఎడతెరిపి లేకుండా […]

నేటి నుంచి నెల్లూరు జిల్లాలో ఫ్లెమింగో ఫెస్టివల్‌!
Follow us

| Edited By:

Updated on: Jan 03, 2020 | 3:18 PM

నెల్లూరు జిల్లాలో శుక్రవారం (జనవరి 3) నుంచి ప్రారంభమయ్యే ఫ్లెమింగో ఫెస్టివల్‌కు అధికారులు విస్తృతమైన ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో యువకులు, స్థానికులు, పర్యాటకులు పెద్ద సంఖ్యలో పాల్గొంటారు. ఈ ఫెస్టివల్ సాధారణంగా నవంబర్ మరియు జనవరి మధ్య జరుగుతుంది. పక్షుల గొప్పతనాన్ని వివరించే సాంస్కృతిక కార్యక్రమం ప్రముఖ ప్రదర్శనకారులతో జరుగుతుంది. అటవీ శాఖ సిబ్బంది సందర్శకుల కోసం సూళ్లూరుపేటలోని పులికాట్ సరస్సు, నేలపట్టు పక్షుల అభయారణ్యాలలో విస్తృత ఏర్పాట్లు చేశారు.

గత సీజన్లో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో పులికాట్ సరస్సు పొంగి పొర్లుతోంది. ఇక్కడికి గత కొన్ని రోజులుగా లడఖ్, టిబెట్, చైనా నుండి పెద్ద సంఖ్యలో ఫ్లెమింగో పక్షులు వలస వచ్చాయి. వేదిక వద్ద సందర్శకులకు సౌకర్యాలు కల్పించడానికి జిల్లా యంత్రాంగం ప్రత్యేక అధికారులను నియమించింది. అనేక ప్రదేశాలలో వ్యూ పాయింట్లను నిర్మించింది. ఇవి పర్యాటకులకు అభయారణ్యంలోని పక్షుల గురించి వివరంగా తెలుసుకునేందుకు సహాయపడతాయి.