కుట్రతో నాపై వేటు వేశారు: యూవీ ఆవేదన
దాదాపుగా రెండేళ్లుగా భారత్ జట్టులో చోటు కోసం ఎదురుచూసిన ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ ఇటీవలే రిటైర్మెంట్‌ను ప్రకటించాడు. కనీసం వీడ్కోలు మ్యాచ్ కూడా లేకుండానే.. తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెల్లడించాడు యూవీ. దీంతో సర్వత్రా విమర్శలు కూడా వచ్చాయి. 2007లో టీ20 ప్రపంచకప్, 2011లో వన్డే ప్రపంచకప్‌లను భారత్ జట్టు గెలవడంలో క్రియాశీలక పాత్ర పోషించిన యూవీకి కనీసం వీడ్కోలు మ్యాచ్ అవకాశం కూడా ఇవ్వలేదని పలువురు క్రీడాభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల యూవీ గురించి […]

దాదాపుగా రెండేళ్లుగా భారత్ జట్టులో చోటు కోసం ఎదురుచూసిన ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ ఇటీవలే రిటైర్మెంట్‌ను ప్రకటించాడు. కనీసం వీడ్కోలు మ్యాచ్ కూడా లేకుండానే.. తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెల్లడించాడు యూవీ. దీంతో సర్వత్రా విమర్శలు కూడా వచ్చాయి. 2007లో టీ20 ప్రపంచకప్, 2011లో వన్డే ప్రపంచకప్‌లను భారత్ జట్టు గెలవడంలో క్రియాశీలక పాత్ర పోషించిన యూవీకి కనీసం వీడ్కోలు మ్యాచ్ అవకాశం కూడా ఇవ్వలేదని పలువురు క్రీడాభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల యూవీ గురించి మాట్లాడిన మాజీ క్రికెటర్ గంభీర్ సైతం కనీసం యువరాజ్ ధరించిన నెం.12 జెర్సీకైనా రిటైర్మెంట్ ప్రకటించి అతడ్ని గౌరవించాలని అన్నారు.
ఇదిలా ఉంటే తాజాగా తనని టీమిండియా మేనేజ్‌మెంట్, సెలక్టర్లు పక్కన పెట్టిన తీరును యూవీ వెల్లడించాడు. ‘‘ఛాంపియన్స్ ట్రోఫీ, వెస్టిండీస్ పర్యటనలో దాదాపు 8-9 మ్యాచ్‌లాడిన నేను రెండు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు అందుకున్నాను. అయినప్పటికీ నాపై వేటు పడుతుందని ఊహించలేదు. గాయం తర్వాత శ్రీలంకతో సిరీస్‌కి సిద్ధమవుతున్నానని టీమిండియా మేనేజ్‌మెంట్‌కి చెప్పాను. కానీ.. సడన్‌గా యో-యో ఫిట్‌నెస్ టెస్టు తెరపైకి వచ్చింది. నా సెలక్షన్‌కి అదే యు టర్న్. ఆ యో-యో టెస్టు కోసం 36 ఏళ్ల వయసులోనూ శ్రమించి.. ఎట్టకేలకి పాసయ్యాను. అయితే.. నేను పాసవుతానని ఊహించని టీమిండియా మేనేజ్‌మెంట్.. నన్ను పక్కన పెట్టడానికి కొత్త కారణాలు వెతికి మరీ కుట్రతో వేటు వేసింది’’ అని యువీ వెల్లడించాడు. ఇక జట్టులో యువకులకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించుకున్న విషయాన్ని సీనియర్ క్రికెటర్లు అయిన సెహ్వాగ్, జహీర్ సహా ఏ ఒక్కరూ ప్రస్తావించలేదని యువీ ఆవేదన వ్యక్తం చేశాడు. టీమిండియాలో ఇలా జరగడం సరికాదని, ఈ విషయంలో తనని తాను సమర్థించుకున్నా, అన్నింటికీ సమయం వస్తుందని భావించానని పేర్కొన్నాడు.