AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shocking: జాంబీ వైరస్‌….తోటి జింకలనే చంపి తింటున్న జింకలు

ఇటీవల కొన్ని సినిమాల్లో మనుషులు జాంబీల్లా మారుతారు. జాంబీ సోకిన మనిషి కరిచిన వారు కూడా జాంబీ బారిన పడతారు. అలాగే ఇప్పుడు కెనడాలో జాంబి సోకిన జింకలు..ఇతర జింకలను చంపి తింటున్నాయి.

Shocking: జాంబీ వైరస్‌....తోటి జింకలనే  చంపి తింటున్న జింకలు
Zombie Disease
Ram Naramaneni
|

Updated on: Apr 07, 2022 | 12:24 PM

Share

Zombie Virus: కరోనా(Coronavirus) పీడ నుంచే ఇంకా బయటపడలేదు. రకరకాల వేరియంట్లు పుట్టుకొస్తూ ప్రపంచాన్ని నాశనం చేస్తున్నాయి. ఈ మహమ్మారిని ఖతం చేసేందుకు వ్యాక్సిన్‌ వచ్చినా ఇంకా పంజా విసురుతూనే ఉన్నాయి న్యూ స్ట్రెయిన్స్‌. ప్రజంట్‌ XE వేరియంట్‌ దడ పుట్టిస్తోంది.  ఐతే ఇప్పుడు కెనడా(Canada)లో మరో మహమ్మారి దాపురించింది. ప్రాణాంతక డేంజరస్‌ వైరస్‌ బెంబేలెత్తిస్తోంది. అదే జాంబీ వైరస్‌. కెనడాలోని జింకల్లో ఈ జాంబి వైరస్‌ బయటపడింది. ఇటీవల కొన్ని సినిమాల్లో మనుషులు జాంబీల్లా మారుతారు. జాంబీ సోకిన మనిషి కరిచిన వారు కూడా జాంబీ బారిన పడతారు. అలాగే ఇప్పుడు కెనడాలో జాంబీ సోకిన జింకలు..ఇతర జింకలను చంపి తింటున్నాయి. జింకల్లో ఈ వైరస్‌ అత్యంత వేగంగా వ్యాపిస్తోంది. ఐతే 1996లోనే పశువుల్లో ఈ జాంబీ వైరస్‌ను గుర్తించారు. వాటి శాంపిల్స్‌ సేకరించి టెస్టులు చేయగా..బాక్టీరియా, ఇతర వైరస్‌ల జన్యు సమాచారం లభించింది. అప్పట్లో ఆ వ్యాధికి అడ్డుకట్ట వేశారు. మళ్లీ దాదాపు 25 ఏళ్ల తర్వాత జింకల్లో జాంబీ వైరస్‌ బయటపడటం టెన్షన్‌ పెడుతోంది.

ఈ వైరస్‌ జింకల నుంచి ఇతర జంతువులు, మనుషులకు కూడా వ్యాపించే అవకాశముందని CWD ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ వైరస్‌ బారిన పడిన వారిలో విరేచనాలు, మానసిక ఒత్తిడి, పక్షవాతానికి గురయ్యే అవకాశముందంటున్నారు. ఈ ఇన్‌ఫెక్షన్‌ సోకిన జంతువు మాంసం తిన్నా..దాని మలమూత్రాలు, లాలాజలం ముట్టుకున్నా కూడా ఈ వ్యాధి సోకే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. వేటగాళ్లు జాగ్రత్తగా లేకపోతే పరిస్థితులు అదుపుతప్పే ప్రమాదం ఉందంటున్నారు. ఐతే ఇప్పటివరకు మనుషుల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదని..ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు. కానీ జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

Also Read:Viral: చేపల కోసం వల వేసిన జాలరి… బయటకు తీయగా మైండ్ బ్లాంక్ అయ్యే సీన్