Costly Medicine: మార్కెట్లోకి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మెడిసిన్‌.. ధర ఎన్ని కోట్లో తెలుసా?

|

Nov 24, 2022 | 8:22 AM

మన ఊహాకు కూడా అందనంత ఖరీదైన ఔషధాన్ని మార్కెట్లోకి తీసుకొచ్చింది ఆస్ట్రేలియా కంపెనీ. బ్లడ్‌ డిసీజ్‌ రక్తానికి సంబంధించిన ఈ మెడిసిన్‌ ఖరీదు అక్షరాలా 29 కోట్ల రూపాయలు. నమ్మలేకపోతున్నారా?. ఇది ముమ్మాటికీ నిజం.

Costly Medicine: మార్కెట్లోకి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మెడిసిన్‌.. ధర ఎన్ని కోట్లో తెలుసా?
Most Expensive Drug
Follow us on

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఔషధం మార్కెట్లోకి వచ్చింది. కాస్ట్లీయెస్ట్‌ మెడిసిన్‌ అంటే లక్షో.. రెండు లక్షలో.. మహా అయితే పది లక్షలో అనుకుంటున్నారా?. కానే కాదు. మన ఊహాకు కూడా అందనంత ఖరీదైన ఔషధాన్ని మార్కెట్లోకి తీసుకొచ్చింది ఆస్ట్రేలియా కంపెనీ. బ్లడ్‌ డిసీజ్‌ రక్తానికి సంబంధించిన ఈ మెడిసిన్‌ ఖరీదు అక్షరాలా 29 కోట్ల రూపాయలు. నమ్మలేకపోతున్నారా?. ఇది ముమ్మాటికీ నిజం. హిమోఫిలియా-B సమస్య కోసం తీసుకొచ్చిన ఈ మెడిసిన్‌ ఖరీదు నిజంగానే 29కోట్ల రూపాయలు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మెడిసిన్‌గా రికార్డు సృష్టించిన ఔషధానికి అమెరికా ఎఫ్‌డీఏ సైతం ఆమోదముద్ర వేసింది. ఆస్ట్రేలియా ఫార్మా కంపెనీ CSL లిమిటెడ్‌ ఈ మెడిసిన్‌ను తయారు చేసింది. రక్తం గడ్డ కట్టకుండా ఉంచడానికి, అత్యంత అరుదైన బ్లడ్‌ డిసీజ్‌ కోసం ఈ డ్రగ్‌ను ఉపయోగిస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఫస్ట్‌టైమ్‌ అందుబాటులోకి వచ్చిన తొలి జన్యుపరమైన చికిత్స ఇది. ఈ కేటగిరిలో ఇంతకుముందే రెండు మెడిసిన్స్‌ వచ్చాయ్‌. ఇవి కూడా అత్యంత ఖరీదైనవే. ఒకటి 2.8 మిలియన్‌ డాలర్లు అయితే, మరొకటి 3 మిలియన్‌ డాలర్లు. ప్రతి 40వేల మందిలో ఒకరు మాత్రమే ఇలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయంటున్నారు వైద్యులు. కాలేయంలో ఉత్పత్తి అయ్యే ఫ్యాక్టర్‌-9 ప్రొటీన్‌ లోపం కారణంగా ఇది వస్తుందని చెబుతున్నారు. అలాంటి వారి కోసమే ఈ మెడిసిన్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు చెబుతోంది ఆస్ట్రేలియా కంపెనీ.

కాగా హిమోఫిలియా-B ట్రీట్‌మెంట్‌ కోసం గతంలో అనేక ఫార్మా కంపెనీలు మెడిసిన్స్‌ను అందుబాటులోకి తెచ్చినా, ఇది చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే ఇది జన్యుపరమైన చికిత్స. అత్యంత ఖరీదైన ఈ చికిత్సలో ఓ ప్రత్యేకమైన జన్యు పదార్ధాన్ని లివర్‌లో ప్రవేశపెడుతుంది. ఇది దీర్ఘకాలికంగా పనిచేస్తూ డిసీజ్‌ను కంట్రోల్‌ చేస్తోంది. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఈ మెడిసిన్‌ అమ్మకాలను ఆల్రెడీ మొదలుపెట్టింది అమెరికా. హీమోజెనిక్స్‌ పేరిట విక్రయాలు చేస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..