Bio War: ప్రపంచం బయో వార్ వైపు అడుగులు వేస్తున్న సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ప్రపంచ మానవాళిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న కరోనా వైరస్ చైనా వదిలిన మొదటి ఆయుధం అని ప్రపంచ దేశాలు భావిస్తున్నాయి. అందుకే చాలా దేశాలు వైరస్ ల పై పరిశోధనలు వేగవంతం చేసినట్టు ప్రచారం జరుగుతోంది. మన భూమి పై ఉన్న10 లక్షల రకాల వైరస్‌లు ఉన్నాయి. వాటిలో కొన్ని జంతువులు, పక్షులపై దాడి చేసే అవకాశం ఉండగా.. మరికొన్ని మనుషుల పై దాడి చేసే అవకాశం ఉందని పరిశోధకులు అంటున్నారు. 3,20,000 రకాల వైరస్‌లు జంతువులపై దాడి చేస్తున్నట్లు ఇప్పటికే గుర్తించారు. మనుషులు, పక్షులు, జంతువుల కంటే ముందే వైరస్ పుట్టింది. ఎప్పటినుంచో వైరస్ తో మనుషులు, జంతువులు సహజీవనం చేస్తున్నారు. తొలిగా గబ్బిలం నుంచి ఒంటెలకు ఆ తర్వాత మనుషులకు మెర్స్ వైరస్ వచ్చిందని చెబుతున్నాయి పరిశోధనలు. ఇప్పటికే మానవుడి పై దాడి చేసిన సార్స్, మెర్స్, స్వైన్ ఫ్లూ, నిపా వైరస్ లు. జన్యుపరమైన మార్పులతోనే కరోనా వైరస్ బయటకొచ్చింది. చైనాలోని వుహాన్ ల్యాబ్‌లో ప్రయోగాలు, ఆ ల్యాబ్ నుంచి కరోనా వైరస్ లీకైందనే వాదన గట్టిగా వినిపిస్తోంది. ఇంకా ఇక్కడ నుంచి చాలా వైరస్‌లు వస్తాయంటున్నారు ప్రపంచ సైంటిస్టులు.
ఈ వాదనను అమెరికా బలంగా నమ్ముతోంది. అయితే, వీటిని కొట్టిపారేస్తోంది చైనా. చైనా వాదనతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏకీభవిస్తోంది. లోతైన పరిశోధన జరగాల్సి ఉందని చెబుతోంది ఆరోగ్య సంస్థ. ఈ క్రమంలో వివిధ దేశాలు సొంతంగా వైరస్‌లను పెంచి పోషిస్తున్నాయని చెబుతున్నారు. ల్యాబుల్లో ప్రయోగాలు, మంచి ఉద్దేశాల కోసమేనంటూ బుకాయింపుతొ ఈ పరిశోధనలు సాగుతున్నాయి. వైరస్‌లు దాడి చేస్తే, ఎలా రక్షించుకోవాలో ఈ ప్రయోగాల ద్వారా తెలుసుకుంటున్నామనే వాదన చేసి అసలు విషయాన్ని దాటవేస్తున్నాయి ఆయా దేశాలు. బయోవార్ కోసమే ఇలా వైరస్‌లను పెంచుతున్నారని ఇంకో వాదన బలంగా వినిపిస్తోంది.
అమెరికా ప్రభుత్వ అకౌంటబులిటీ ఆఫీస్ లెక్కల ప్రకారం.. అమెరికాలో 4 లెవల్ ల్యాబులు, 15 పరిశోధనా ల్యాబ్ లు ఉన్నాయి. రకరకాల ప్రాణాంతకమైన వైరస్‌లు, పాతోజెన్లపై ఇక్కడ ప్రయోగాలు జరుగుతున్నాయి. టెక్సాస్‌లో ఉన్న టెక్సాస్ బయోమెడికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ 1941లో నిర్మించారు. ఈ ల్యాబ్ లో వైరస్‌లపై రకరకాల పరిశోధనలు జరుగుతున్నాయి. ఇక్కడ 60 మంది శాస్త్రవేత్తలు, 18 మంది పరిశోధకులు, 400 మంది సిబ్బంది పని చేస్తున్నారు. అమెరికాలోని ప్రైవేట్ ల్యాబ్ ఇదొక్కటే. ఇక్కడ లెవెల్ 4 పాతోజెన్లపై పరిశోధనలు కొనసాగుతున్నాయి. చాలా దేశాలు తమ దేశంపై శత్రు దేశం వైరస్‌తో దాడి చేస్తే తిప్ప కొట్టే వ్యూహం కోసం ప్రయత్నాలు చేస్తున్నాయి. అందుకే ప్రాణాంతకమైన వైరస్‌లను పెంచి పోషిస్తున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వాటిని నిరూపించే ఆధారాలు లేకపోవడంతో సంకటస్థితి కనిపిస్తోంది. వాటి ల్యాబుల వద్దకు ఎవరినీ ఆయా దేశాలు అనుమతి ఇవ్వడం లేడు.
ఇక రష్యాలో 1974లో స్టేట్ రీసెర్చ్ సెంటర్ ఫర్ వైరాలజీ అండ్ బయోటెక్నాలజీ నిర్మించారు. ఇక్కడ వైరస్‌లు, బ్యాక్టీరియా, వాటి ద్వారా వచ్చే వ్యాధులపై పరిశోధనలు జరుగుతున్నాయి. స్మాల్‌పాక్స్, హెపటైటిస్ పై లోతైన పరిశోధనలు ఇక్కడ కొనసాగుతున్నాయి. 2004లో ల్యాబ్ లో ఓ పరిశోధకుడు ఎబోలా (Ebola) వైరస్‌ను ఎక్కించుకున్నాడనే వాదన వినిపించింది. ఆ పరిశోధకుడు 2 వారాల తర్వాత చనిపోవడంతో చర్చ మొదలైంది. అదేవిధంగా 2019 సెప్టెంబర్‌లో విక్టర్‌లో గ్యాస్ బ్లాస్ట్ జరిగింది.. ఈ ప్రమాదంలో థర్డ్ డిగ్రీ గాయాలతో కొంతమంది ఆస్పత్రిపాలు అయ్యారు. ఆ సంఘటనలో ఏ వైరస్‌లూ బయటకు రాక పోవడంతో ఊపిరి సైంటిస్టులు ఊపిరి పీల్చుకున్నారు.
చైనాలో వుహాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీలో పరిశోధనలు ముమ్మరంగా సాగుతున్నాయి. అక్కడే సముద్ర ఆహార మార్కెట్ కూడా ఉంది. కరోనా వైరస్ 2019లో మొదటిసారి ఆ మార్కెట్‌లోనే కొందరికి సోకడంతొ అది ల్యాబ్ నుంచి వచ్చి సోకిందనే వాదన వినిపిస్తోంది. సముద్ర ఆహారం నుంచి వచ్చి సోకిందా అని పరిశోధనలు సాగుతున్నాయి. అయితే, అక్కడ అమ్మే అడవి జంతువుల నుంచి వచ్చి వైరస్ సోకిందనే మరో వాదనా వినిపిస్తోంది. కానీ, నిజానికి ఈ వైరస్ పరిశోధనల్లో ఉన్న శాస్త్రవేత్తల తప్పు కారణంగా ప్రపంచం కొంప మునిగింది అని ప్రస్తుతం తెలుస్తోంది.
ఇజ్రాయెల్, ఇరాక్, ఇరాన్, దక్షిణ కొరియా, ఉత్తర కొరియా ల్యాబుల్లో కూడా వైరస్ ల పై పరిశోధనలు జరుగుతున్నాయి. అదేవిధంగా జపాన్, జర్మనీ, ఫ్యాన్స్ లోను ఈ పరిశోధనలు గట్టిగానే జరుగుతున్నాయి.
అసలు ఇబ్బంది ఏంటంటే..
దీంతో ఈ పరిశోధనలు ఎటువైపుకు దారి తీస్తాయోనని ఆందోళన ప్రపంచం అంతా నెలకొని ఉంది. ఇవన్నీ చూస్తుంటే మనమంతా కొద్ది కాలం తరువాతైనా వైరస్ లతో సహజీవనం చేసే పరిస్థితి తప్పకపోవచ్చు.
Also Read: Nasal Spray: నాసల్ స్ప్రేతో కోవిద్ వైరస్ మాయం…కెనడాలోని శానోటైజ్ రీసెర్చ్ బయోటెక్ సంస్థ ప్రకటన
CDC warning: కోళ్లను ముద్దు చేస్తున్నారా….. వాటి ద్వారా కొత్త ఇన్‌ఫెక్షన్.. సీడీసీ హెచ్చరిక