PM Modi UNGA: భారత ప్రధాని నరేంద్రమోదీ మూడు రోజుల అమెరికా పర్యటనలో భాగంగా శనివారం న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయానికి వెళ్లి యూఎస్ జనరల్ అసెంబ్లీ 76వ సమావేశంలో ప్రసంగించారు. గత ఏడాదిన్నరగా ప్రపంచం.. 100 సంవత్సరాలలో చూడని అత్యంత భయంకరమైన వ్యాధిని ఎదుర్కొంటోంది. ఈ మహమ్మారి కారణంగా ఎందరో బలయ్యారని, ఎంతోమందిరి కోలుకోలేని దెబ్బతీసిందని, ఈ వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారందరిని నివాళి అర్పిస్తున్నానని, కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను అని అన్నారు. ఈ ఏడాది ఆగస్టు 15 న, భారతదేశం 75 వ స్వాతంత్ర్య సంవత్సరంలోకి ప్రవేశించింది. మన భిన్నత్వం మన బలమైన ప్రజాస్వామ్యానికి గుర్తింపు. భారతదేశంలోని టీ స్టాల్‌లో తన తండ్రికి సాయం చేస్తున్న ఒక చిన్న పిల్లవాడు నాలుగోసారి భారత ప్రధానిగా యూఎన్‌జీఏని ఉద్దేశించి ప్రసంగించడం ద్వారా మన ప్రజాస్వామ్య బలం నిరూపించబడింది.
భారతదేశం ఎదిగినప్పుడు, ప్రపంచం ఎదుగుతుంది. భారతదేశం సంస్కరించబడిప్పుడు, ప్రపంచం మారుతుంది. అభివృద్ధి అనేది అందరినీ కలుపుకొని, సార్వత్రికంగా మరియు అందరినీ పోషించేదిగా ఉండాలి. అంత్యోదయ సూత్రంతోనే భారతదేశం నేడు సమగ్ర సమన్వయ అభివృద్ధి మార్గంలో ముందుకు సాగుతోందని అన్నారు. మా ప్రాధాన్యత ఏమిటంటే అభివృద్ధి అనేది అన్నింటినీ కలుపుకొని, సర్వవ్యాప్త, సార్వత్రికమైనది మరియు అందరినీ పోషించేదిగా ఉండాలి. 75 సంవత్సరాల స్వాతంత్య్రం సందర్భంగా, భారత విద్యార్థులు తయారు చేసిన అంతరిక్షంలోకి భారతదేశం 75 ఉపగ్రహాలను ప్రయోగించబోతోందని అన్నారు. ప్రపంచంలోనే మొట్టమొదటి డీఎన్‌ఏ (DNA) టీకాను భారతదేశం అభివృద్ధి చేసిందని ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీకి తెలియజేయాలనుకుంటున్నానని మోదీ అన్నారు. ఇది 12 ఏళ్ల కన్నా ఎక్కువ వయస్సు ఉన్న ఎవరికైనా ఇవ్వబడుతుంది. ఒక mRNA టీకా అభివృద్ధి చివరి దశలో ఉంది. భారతీయ శాస్త్రవేత్తలు కూడా COVID19 కి వ్యతిరేకంగా నాజల్ వ్యాక్సిన్‌ను(ముక్కు ద్వారా ఇచ్చేది) అభివృద్ధి చేస్తున్నారు అని అన్నారు.
ఈ రోజు, ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్ తయారీదారులందరికీ భారతదేశంలో టీకాలు తయారు చేయమని నేను ఆహ్వానిస్తున్నాను.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మరింత వైవిధ్యభరితంగా ఉండాలని కరోనా మహమ్మారి ప్రపంచానికి బోధించింది. అందుకే గ్లోబల్ వాల్యూ చైన్ విస్తరణ ఎంతో ముఖ్యం. మా ‘ఆత్మనిర్భర్ భారత్ అభియాన్’ ఈ భావంతోనే ప్రేరణ పొందింది. భారతదేశాన్ని ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ హైడ్రోజన్ హబ్‌గా తీర్చిదిద్దే పనిని కూడా ప్రారంభించాము అని మోదీ అన్నారు.
అఫ్ఘానిస్తాన్‌లోని సున్నితమైన పరిస్థితులను సద్వినియోగం చేసుకోవడానికి, మరియు దానిని తన స్వార్థ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడానికి ఏ దేశం ప్రయత్నించకూడదు. ఈ సమయంలో, అఫ్ఘానిస్తాన్ ప్రజలు, మహిళలు, పిల్లలు, మైనారిటీల సహాయం ఎంతో అవసరం. వారికి సహాయం చేయడం ద్వారా మనం మన విధులను నెరవేర్చాలి అని అన్నారు.
Little boy who helped his father at tea stall is addressing UNGA for fourth time: PM Modi
Read @ANI Story | https://t.co/H31QutwUuc#PMModiUSVisit #UNGA #PMModi pic.twitter.com/t1AUtwZiqX
— ANI Digital (@ani_digital) September 25, 2021
PM Modi at UNGA invites global manufacturers to come and make vaccines in India
Read @ANI Story | https://t.co/K3tLjjMgQl#UNGA #PMModiUSVisit #PMModiatUNGA pic.twitter.com/WC7cEcOLRK
— ANI Digital (@ani_digital) September 25, 2021