World Health Day 2021: నేడు ప్రపంచ ఆరోగ్య దినం.. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో మన ఆరోగ్యము మనమే కపాడుకోవాలని పిలుపు

| Edited By: Ravi Kiran

Apr 07, 2021 | 9:11 PM

World Health Day 2021:  మొదటి ప్రపంచ ఆరోగ్య దినోత్సవంను ఏప్రిల్ 7, 1950న జరిపారు. ఏప్రిల్ 7, 1948న ఏర్పాటైన ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఈ తేదిని ఎంపిక..

World Health Day 2021:  నేడు ప్రపంచ ఆరోగ్య దినం.. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో మన ఆరోగ్యము మనమే కపాడుకోవాలని పిలుపు
World Health Day
Follow us on

World Health Day 2021:  మొదటి ప్రపంచ ఆరోగ్య దినోత్సవంను ఏప్రిల్ 7, 1950న జరిపారు. ఏప్రిల్ 7, 1948న ఏర్పాటైన ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఈ తేదిని ఎంపిక చేసారు. ప్రతి ఏడాది ప్రపంచ ఆరోగ్యానికి ప్రధాన ప్రాముఖ్యత ఉన్న అంశంపై ప్రపంచవ్యాప్త దృష్టిని ఆకర్షించేటట్లు ఈ సంస్థ చూస్తుంది. ఇక ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని వివిధ ప్రభుత్వాలు, ప్రభుత్వేతర సంస్థలు ప్రజా ఆరోగ్య సమస్యలపై ఆసక్తితో వివిధ కార్యకలాపాలను నిర్వహిస్తారు.

ప్రపంచాన్ని కరోనా చుట్టేస్తున్న నేపథ్యంలో ఈ 2021 సంవత్సరం నిర్దేశించుకున్న స్లోగన్.. మన ఆరోగ్యం మన బాధ్యత. అవును మన కోసం మన ఆరోగ్యాన్ని రక్షించడం కోసం ఎవరో వచ్చి, ఏదో చేయరు. మన ఆరోగ్యాన్నికాపాడుకోవాల్సింది మనమే.. అందుకు సంకల్పించుకోవాల్సింది కూడా మనమే. శ్రద్ధ తీసుకోవాల్సిందీ మనమే. ఆరోగ్య సంరక్షణలో అన్నింటికన్నా ముఖ్యమైంది, కీలకమైంది మన జీవనశైలి.

మనం ఆరోగ్యంగా ఉండడానికి మంచి ఆహారం, బరువు అదుపు, క్రమం తప్పని వ్యాయామం, మానసిక ప్రశాంతత ఇవి చాలు. వ్యాయామం కూడా పెద్ద పెద్ద లక్ష్యాలే అవసరం లేదు. చిన్న చిన్న మార్పులైనా చాలు. నెమ్మదిగా ఆరంభించినా చాలు. మంచి ప్రయోజనం కల్పిస్తుంది. క్రమంగా ఒక అలవాటుగా మారి, చక్కటి ఆరోగ్య జీవితానికి మార్గం సుగమం చేస్తుంది. ప్రపంచ ఆరోగ్య దినం పరోక్షంగా ఇదే సూచిస్తోంది. సమానమైన, మెరుగైన ఆరోగ్య ప్రపంచాన్ని నిర్మించాలని నినదిస్తోంది.

పుట్టిన చోటు, పెరిగిన తీరు, చదివిన చదువు, చేస్తున్న పని, ఆర్థిక స్థితి, జీవన విధానం, వయసు, లింగ బేధం వంటివన్నీ ఆరోగ్యాన్ని ప్రభావితం చేసేవే కావొచ్చు. వైద్య సదుపాయాలు, చికిత్సల విషయంలో ఇవి అసమానతలకూ దారితీస్తుండొచ్చు. కానీ వ్యక్తిగత శ్రద్ధకు ఇవేవీ ఆంటకాలు కావు. డబ్బున్నా లేకున్నా, ఎవరైనా ఎక్కడైనా మంచి జీవనశైలితో సంపూర్ణ ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. జబ్బుల బారినపడకుండా హాయిగా, ఆనందంగా జీవించొచ్చు. మనసుంటే మార్గం దొరక్కపోదు.

కోవిడ్19 మళ్లీ విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరు స్వీయ నియంత్రణ కలిగి ఉండాలి. కరోనా నిబంధనలు పాటిస్తూ..తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక 45 ఏళ్లు దాటిన వారు టీకాలు వేసుకుని రక్షణ పొందండి. కరోనా నివారణ చర్యలు చేపడుతూ.. దానిని తరమికొడదాం..!

నేడు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం.. కరోనా నేపథ్యంలో అందరికీ చక్కని, ఆరోగ్యకరమైన ప్రపంచాన్ని నిర్మించడం”  ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా మన వైద్యులు ఆరోగ్య అసమానతలను తొలగించడానికి చర్యలు తీసుకోవాలని పిలుపునిస్తున్నారు, ఒక మంచి, ఆరోగ్యకరమైన ప్రపంచాన్ని నిర్మించడానికి ప్రజలను ఒక చోటకు చేర్చే విధంగా ఈ వేడుక ప్రతి ఏడాదిలోనూ నిర్వహిస్తారు.

Also Read: రోజూ త్వరగా అలసిపోతున్నారా..అయితే అవయవాలు విశ్రాంతిని కోరుతున్నాయి.. ఈ ఆసనం ట్రై చేయండి

 అక్కడ వింత ఆచారం.. అమ్మవారికి చెప్పుల నైవేద్యం.. రాత్రి దేవత చెప్పులు వేసుకుని గ్రామంలో తిరుగుతుందని నమ్మకం