Hand Hygiene day: జర భద్రం.. చేతులను శుభ్రం చేసుకుంటే ఉపయోగాలు ఏమిటి.? నేడు చేతుల పరిశుభ్రత దినోత్సవం

|

May 05, 2021 | 9:12 AM

World Hand Hygiene Day 2021: మీరు ప్రతి రోజు ఎన్నిసార్లు చేతులను సబ్బుతో శుభ్రం చేసుకుంటారు..? చేతులు శుభ్రం చేసుకోవడం వల్ల ప్రయోజనాలేమిటి..? అయితే..

Hand Hygiene day: జర భద్రం.. చేతులను శుభ్రం చేసుకుంటే ఉపయోగాలు ఏమిటి.? నేడు చేతుల పరిశుభ్రత దినోత్సవం
Hand Hygiene Day
Follow us on

World Hand Hygiene Day 2021: మీరు ప్రతి రోజు ఎన్నిసార్లు చేతులను సబ్బుతో శుభ్రం చేసుకుంటారు..? చేతులు శుభ్రం చేసుకోవడం వల్ల ప్రయోజనాలేమిటి..? అయితే ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి కారణంగా ప్రతి రోజు ఎక్కువ సార్లు చేతులను శుభ్రం చేసుకోవడం ప్రతి ఒక్కరికి అలవాటైపోయింది. కరోనా నేపథ్యంలో ఈ చేతుల పరిశుభ్రత దినానికి ఎంతో ప్రత్యేకత చేకూరింది. కోవిడ్‌-19 దెబ్బకు.. ప్రపంచంలోని అన్ని దేశాల ప్రజలూ ఇప్పుడు చేతుల పరిశుభ్రతకు అత్యంత ప్రాధానమిస్తున్నారు. అలాగే గతంలో ప్రపంచాన్ని వణికించిన ఎబోలా.. దేశాన్ని వణికించిన స్వైన్‌ఫ్లూ వంటి ప్రాణాంతక వ్యాధులతో పాటు కరోనా నుంచి రక్షణకు మనం ఏం చేయాలని వైద్యనిపుణులు సూచించారో తెలుసా? తరచూ చక్కగా సబ్బుతో చేతులు శుభ్రపర్చుకొంటే ఆయా జబ్బులనుంచి రక్షణ లభిస్తుందని ప్రకటించారు. ఆసుపత్రులకు వెళ్లినప్పుడు అక్కడ ఇతర వ్యక్తులకు కరచాలనం చేయవద్దని, ఒకవేళ కరచాలనం చేయాల్సివస్తే వెంటనే సబ్బుతో చేతులు శుభ్రపర్చుకోవాలని వారు సూచిస్తున్నారు.

నిజానికి సబ్బుతో చేతులు కడుక్కోవడం వల్ల పలు రకాల జబ్బుల నుంచి పూర్తి రక్షణ లభిస్తుందని అంతర్జాతీయ స్ధాయిలో పలు అధ్యయనాల ద్వారా నిపుణులు తేల్చారు. చేతుల పరిశుభ్రత పాటిస్తే 25 నుంచి 50శాతం శ్వాసకోశ, జీర్ణాశయ సంబంధ ఇన్‌ఫెక్షన్ల నుంచి పూర్తిగా రక్షణ పొందవచ్చు. వీటితోపాటు మరో ఎనిమిది ఇతర రకాల ఇన్‌ఫెక్షన్ల నుంచి కూడా రక్షణ లభిస్తుంది.

అయితే ప్రతి యేటా మే 5వ తేదీన చేతుల పరిశుభ్రత దినోత్సవం (Hand Hygiene day ) డేను జరుపుకొంటున్నాము. ప్రజల్లో ఆరోగ్య పరిరక్షణపై అవగాహన పెంచేందుకు ఏటా ప్రపంచ ఆరోగ్య సంస్థ పలు దినోత్సవాలు నిర్వహిస్తుంది. అందులో ముఖ్యమైన దినోత్సవం ’చేతుల పరిశుభ్రత దినోత్సవం. చిన్న పని పెద్ద ఫలితం ఇస్తుందని చేతుల పరిశుభ్రత దినోత్సవం ద్వారా ప్రజలకు చక్కటి సందేశం ఇచ్చేందుకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రపంచవ్యాప్తంగా 70 దేశాల్లో హ్యాండ్‌ వాషింగ్‌ డేను పాటిస్తున్నారు.

ఇక కరోనా మహమ్మారి కారణంగా ప్రతి సారి చేతులను శుభ్రం చేసుకోవడం జరుగుతోంది. అలాగే గతంలో మధ్యప్రదేశ్‌లో 12 లక్షల 76 వేల 425 మంది విద్యార్థులు ఏకకాలంలో సబ్బుతో చేతులు శుభ్రపర్చుకొని గిన్నిస్‌బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డు సృష్టించారు. దేశంలో కనీసం 100 మిలియన్ల మంది విద్యార్థులకు చేతుల పరిశుభ్రతపై అవగాహన కల్పించాలని వైద్య ఆరోగ్య శాఖ, స్వచ్ఛంద సంస్థలు కృషి చేస్తున్నాయి.

అయితే చేతులను సబ్బుతో కడిగి పరిశుభ్రం చేసుకోవడం వల్ల పలు రకాల ఇన్‌ఫెక్షన్ల నుంచి రక్షణ లభిస్తుందని వైద్యనిపుణులు విస్తృత ప్రచారం చేస్తున్నారు. ఈ కరోనా కాలంలో మరింత మంది అవగాహన పెంచుకున్నారు. ముఖ్యంగా భోజనానికి ముందు, మల, మూత్ర విసర్జన తర్వాత చేతులను శుభ్రపర్చుకోవడం దినచర్యలో భాగం కావాలి. ఈ విషయంపై తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పిల్లలకు తగిన విధంగా అవగాహన కల్పించాలి. చేతుల పరిశుభ్రత పాటిస్తే పలు రకాల సీజనల్‌ వ్యాధుల నుంచి తీవ్రమైన స్వైన్‌ఫ్లూ వంటి వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుందని వైద్యనిపుణులు స్పష్టం చేస్తున్నారు.

ఇవీ చదవండి:

Duplicate Numbers: ప్లాస్మా దానం పేరుతో నకిలీ నెంబర్లు.. సోషల్‌ మీడియాలో వందలాది ఫోన్‌ నెంబర్ల లిస్టు

తెల్ల జుట్టుకు కలర్ వాడుతున్నారా..! అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి..? ఫలితం ఉండదు..