ప్రపంచవ్యాప్తంగా ఆహార వృధా గణాంకాలు చాలా నిరాశాజనకంగా ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఆహారం ఎంతో వృథా అవుతోంది. అక్టోబర్ 16న ప్రపంచ ఆహార దినోత్సవం. ఈ పరిస్థితిని అధిగమించడమే ప్రపంచ ఆహార దినోత్సవం ముఖ్య ఉద్దేశ్యం. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఆహారం వృధా అవుతోంది. వృధా అవుతున్న ఆహారం లక్షలాది మంది ఆకలిని తీర్చవచ్చు. ఇలా వృధా కాకుండా ప్రతి ఒక్కరు జాగ్రత్తలు తీసుకోవాలి. జానెడు పొట్ట నింపుకోవటానికి కాయకష్టం చేసే కూలీల నుంచి కోట్లకు పడగలెల్లినవారు కూడా ఆకలితో ఏ పని చేయలేదు. ఆ కడుపు నింపుకోవటానికి ఎన్నో పాట్లు పడాల్సి వస్తుంటుంది. ఈ ఆకలి అనేది ఆకలి సమస్య పేద దేశాల్లోనే కాదు.. ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా ఆకలి కేకలు వినిపిస్తుండటం గమనించాల్సిన విషయం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలన్నింటిన్నింటిని సమానత్వంతో చూస్తుంది ఆకలి. మనిషే కాదు.. ప్రతీ జీవిని ఆకలి సమానత్వంతోనే చూస్తుంది. పేద గొప్పా తనే తేడా లేదు ఆకలికి. అటువంటి ఆకలి తీర్చటానికే ఈ ప్రపంచ ఆహార దినోత్సవం. ప్రపంచ ఆకలి తీర్చడమే వరల్డ్ ఫుడ్ డే ప్రధాన లక్ష్యం. ప్రపంచవ్యాప్తంగా 150 కి పైగా దేశాలు ఈ ‘వరల్డ్ ఫుడ్ డే’ కార్యక్రమంలో పాల్గొంటాయి.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి