
Biggest Cruise Ship: టైటానిక్ షిప్(Titanic Ship) గురించి తెలియనివారుండరు.. అప్పట్లో విషాదాంతం అయినప్పటికీ, టైటానిక్ అతి పెద్ద ఓడగా పేరుగాంచింది. ఆ తర్వాత దాన్ని తలదన్నేలా అనేక భారీ క్రూయిజ్ నౌక(Cruise Ship)లు తయారయ్యాయి. ఇప్పుడు వాటన్నింటిని మించిపోయేలా ప్రపంచంలోనే అతిపెద్ద క్రూయిజ్ షిప్ రంగప్రవేశం చేయనుంది. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన రాయల్ కరీబియన్ క్రూయిజ్ లైనర్ సంస్థ కొత్తగా వండర్ ఆఫ్ ద సీస్ పేరిట భారీ క్రూయిజ్ షిప్ ను తీసుకువస్తోంది. 1,188 అడుగుల పొడవు, 210 అడుగుల వెడల్పుతో గత మూడేళ్లుగా నిర్మితమవుతున్న ఈ అద్భుత నౌక మార్చి 4న ఫ్లోరిడాలోని ఫోర్ట్ లాడర్ డేల్ నుంచి కరీబియన్ దీవులకు తొలిసారి ప్రయాణం కాబోతోంది. ఆ తర్వాత మే నెలలో బార్సిలోనా నుంచి రోమ్‌కి వెళ్లనుంది. 18 అంతస్తుల ఈ క్రూయిజ్ నౌకను ఫ్రాన్స్ లోని సెయింట్ నజైర్ లో రూపొందించారు.
ఈ వండర్ ఆఫ్ ద సీస్ క్రూయిజ్ నౌకలో మొత్తం 6,988 అతిథులు, 2,300 సిబ్బంది ప్రయాణించవచ్చు. ఈ భారీ ఓడ నిర్మాణం 2021లోనే పూర్తి కావాల్సి ఉండగా, కరోనా మహమ్మారి సంక్షోభ ప్రభావం దీనిపైనా పడింది. ఇక ఈ నౌకను అలలపై కదిలే విలాసవంతమైన నగరం అని చెప్పొచ్చు. ఓ నగరంలో ఉండే సౌకర్యాలన్నీ దీంట్లో ఉంటాయి. భారీ తెరతో కూడిన సినిమా థియేటర్, అత్యాధునిక ప్లంజ్ పూల్ బార్, వండర్ ప్లే స్కేప్, ఓపెన్ ఎయిర్ కిడ్స్ ప్లే జోన్, క్లైంబింగ్ వాల్స్, గేమ్స్, అల్టిమేట్ ఫ్యామిలీ సూట్, భారీ హంగులతో మెయిన్ డైనింగ్ రూమ్, పార్కు, స్పోర్ట్స్ బార్, వండర్ లాండ్, లైవ్ మ్యూజిక్ థియేటర్లు దీనిలో ఏర్పాటు చేశారు. 2,867 రూములు, 24 గెస్ట్ ఎలివేటర్లతో ఏర్పాటు చేసిన ఈ షిప్ 22 నాట్ల వేగంతో దూసుకుపోతుంది.
Also Read: