భార్యాభర్తల బంధం ఏడేడు జన్మల బంధం అని నమ్మకం. అయితే కాలంలో వచ్చిన మార్పుల్లో భాగంగా భార్యాభర్తల బంధంలో కూడా మార్పులు వచ్చాయి. నువ్వు ఎంత అంటే నువ్వు ఎంత అనుకునే రేంజ్ లో సాగుతున్నాయి. ఒకొక్కసారి బంధాలకు బీటలు పడి చిన్న చిన్న కారణాలతో విడాకుల కోసం కోర్టు మెట్లు కూడా ఎక్కే దంపతులు కనిపిస్తూనే ఉన్నారు. పెద్దలు కుదిర్చినా, ప్రేమించి పెళ్లి చేసుకున్నా నేను ఎందుకు అడ్జెస్ట్ కావాలనే పంతంతో ఒకట్రెండు సంవత్సరాల్లో సంబంధాలు తెగిపోతున్నాయి. అయితే గత కొన్నేళ్ల క్రితం వరకూ అలా ఉండేది కాదు. మూడుముళ్లతో ఏర్పడిన భార్యాభర్త బంధం చివరి క్షణం వరకూ సాగేది. ఎప్పుడూ ఒకరితో ఒకరు కలిసి జీవించేవారు. సుఖమైనా, దుఃఖమైనా ఒకరితో ఒకరు పంచుకుంటూ జీవించేవారు. ముఖ్యంగా భార్యలు తమ భర్తను ప్రత్యక్ష దైవంగా భావించి పూజించేవారు. తమ భర్తలకు హృదయపూర్వకంగా సేవ చేయడం, వారిని గౌరవించడం, వారి పాదాలను తాకడం వంటివి చేసేవారు. అయితే మారుతున్న కాలంలో భావజాలంలో మార్పులు వచ్చాయి. మేము మగవారికంటే ఎందుకో తక్కువ అనే భావం కలిగిన అమ్మాయిలే అధికం. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ అరుదైన వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోను పలువురు ఎంజాయ్ చేస్తున్నారు.
వైరల్ అవుతున్న వీడియోలో ఓ భార్య తన భర్త కాళ్లు కడుగుతూ కనిపించింది.. అంతే కాదు తన భర్త పాదాల నీళ్లను కూడా తాగి ఆ పాదాలను నుదుటిపై పెట్టుకుంది. డోర్ వద్ద భర్త నిలబడి ఉండగా, భార్య కాళ్లు కడుక్కొని తలపై నీళ్లు చల్లుకోవడం వీడియోలో చూడవచ్చు. ఆ తర్వాత ఆమె తన భర్త పాదాలను తాకి నీళ్లు తాగుతూ కనిపిస్తుంది. అప్పుడు ఆమె కూడా తన భర్త పాదాలపై పడుతుంది. ఈ వీడియోను చూసిన ప్రజలు చాలా ఆశ్చర్యపోతున్నారు, ఎందుకంటే అలాంటి దృశ్యాలు చాలా అరుదుగా కనిపిస్తాయి. ఈ వీడియో ఎక్కడిది అనేది తెలియరాలేదు, అయితే ఈ జంట నేపాల్‌కి చెందినవారని నెటిజన్లు కామెంట్స్‌లో వెల్లడించారు.
అద్భుతమైన భార్యాభర్తల వీడియో చూడండి
बहुत पुछा लेकिन KAMBAKHT बता नहीं रहा कहां से लाया ऐसी बीवी? pic.twitter.com/3IleuPkYgz
— Hasna Zaroori Hai (@HasnaZarooriHai) October 22, 2022
భార్యాభర్తల ఈ అద్భుతమైన వీడియో @HasnaZarooriHai అనే ID పేరుతో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఈ 14 సెకన్ల వీడియోను ఇప్పటివరకు 11 వేలకు పైగా వీక్షించగా, వందలాది మంది లైక్ చేసారు .వివిధ ఫన్నీ రియాక్షన్‌లు ఇచ్చారు. ఆ భర్త మంచి భార్య కోసం ‘ఖచ్చితంగా 160 సోమవారం ఉపవాసం చేసి ఉండాలి’ అని ఓ యూజర్ కామెంట్ చేస్తే.. అలాంటి భార్యను ఎక్కడికి తీసుకురావాలో చెప్పడం లేదని మరొకరు వ్యాఖ్యానించారు. మొత్తానికి మగాళ్లకు మాకు ఇటువంటి భార్యకావాలి అని అంటున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..