Double Pregnancy Woman: సైన్స్‌కే సవాల్.. గర్భంతో ఉన్న మహిళ మూడు వారాల తర్వాత మళ్ళీ ప్రెగ్నెన్సీ!

|

Feb 13, 2021 | 5:58 PM

మనిషి  తన మేధస్సుకు పదును పెట్టి సృష్టి రహస్యాలను కనిపిట్టేస్తున్నా.. కృతిమ మెదడు.. రక్తం వంటివి తయారు చేస్తున్న శాస్త్రజ్ఞులకు సవాల్ విసురుతూ.. సృష్టిలో మానవమేధస్సుకు అందని ఆశ్చర్యపరిచే అద్భుతాలు జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే అద్భుతం కూడా అటువంటిదే..

Double Pregnancy Woman: సైన్స్‌కే సవాల్.. గర్భంతో ఉన్న మహిళ మూడు  వారాల తర్వాత మళ్ళీ ప్రెగ్నెన్సీ!
Follow us on

Double Pregnancy Woman: మనిషి  తన మేధస్సుకు పదును పెట్టి సృష్టి రహస్యాలను కనిపెట్టేస్తున్నా.. కృతిమ మెదడు.. రక్తం వంటివి తయారు చేస్తున్నా ప్రకృతి శాస్త్రజ్ఞులకు సవాల్ విసురుతూనే ఉంది.. సృష్టిలో మానవమేధస్సుకు అందని ఆశ్చర్యపరిచే అద్భుతాలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే అద్భుతం కూడా అటువంటిదే.. ఓ మహిళ గర్భంతో ఉండగానే ఆ బిడ్డ పుట్టకుండానే మళ్ళీ ఆమె గర్భవతి అయ్యి.. అందరికీ షాక్ ఇస్తోంది. అవును గర్భం తో ఉన్న ఓ మహిళ మళ్ళీ గర్భవతి అయ్యింది. ఈ అరుదైన విచిత్ర ఘటన ఇంగ్లాండ్ లో చోటు చేసుకుంది. ఇలాంటి గర్భాన్ని ‘సూపర్ఫెటేషన్’ లేదా ‘డబుల్ ప్రెగ్నెన్సీ’ అంటారని వైద్యులు చెప్పారు.

ఇంగ్లాండ్‌లోని ట్రౌబ్రిడ్జ్‌లో నివసిస్తున్న 39 ఏళ్ల మహిళ రెబక్కా రాబర్ట్స్ డబుల్ ప్రెగ్నెసీ ఉమెన్ గా రికార్డ్ సృష్టించింది. ఈ అద్భుతం గత డిసెంబర్ లో జరిగింది. .రెబక్కా రాబర్ట్,  రైస్ వీవర్ దంపతులకు సమ్మర్ అనే 14 ఏళ్ల కూతురు ఉంది. అయితే ఇటీవలే రెబెక్కా మళ్లీ గర్భం దాల్చింది. మూడు వారాల అనంతరం పరీక్షలకు వెళ్ళగా రెబెక్కాకు షాకింగ్ న్యూస్ చెప్పారు డాక్టర్లు. అప్పటికే గర్భంతో  ఉన్న రెబెక్కా కడుపులో ఇంకో బిడ్డ రూపుదిద్దుకుంటుందని చెప్పారు. ఇది ఆమెకే కాదు డాక్టర్లకు కూడా షాక్ కలిగించింది.

ఈ విషయంపై రెబెక్కా స్పందిస్తూ.. గర్భం ధరించిన అనంతరం బిడ్డ ఆరోగ్యం గురించి తెలుసుకోవటానికి డాక్టర్లు స్కాన్ చేశారు. అప్పుడు గర్భంలో ఒక్క బిడ్డే ఉంది. రెండు సార్లు స్కాన్ చేసి బిడ్డ పెరుగుదల గురించి తెలుసుకున్నారు.. ఇక మూడు వారాల తర్వాత బిడ్డ పెరుగుదల కోసం స్కాన్ చేస్తే.. గర్భంలో మరో బిడ్డ కూడా ఉందని తెలిసిందని చెప్పింది. మూడు వారాల అనంతరం తనకు కవల పిల్లలు ఉన్నారని డాక్టర్లు చెప్పారు. అది నాకు షాకింగ్ న్యూస్ అని రెబెక్కా చెప్పింది. అంతే కాదు కేవలం మూడు వారాల్లో మరో బిడ్డ ఎలా రూపుదిద్దుకుంటుందని.. ఆశ్చర్యపోయానని తన అనుభవాన్ని పంచుకుంది. ఇదే విషయంపై డాక్టర్లు స్పందిస్తూ.. ఇటువంటి గర్భాన్ని ‘సూపర్ఫెటేషన్’ లేదా ‘డబుల్ ప్రెగ్నెన్సీ’ అంటారని చెప్పారు. అంతేకాదు ఆమె ప్రెగ్నెసీ కోసం వాడిన మందుల వల్లనే డబుల్ ప్రెగ్నెన్సీ వచ్చి ఉంటుందని డాక్టర్లు చెప్పారు. రెబెక్కా తీసుకున్న మందుల ఫలితంగా ఆమె గర్భంతో ఉన్నప్పుడు మరో అండం విడుదలై ఉంటుదని.. అందుకే ఆమె మళ్లీ గర్భం దాల్చిందని ఊహిస్తున్నారు.

33 వారాల తర్వాత 2020 సెప్టెంబరులో రెబెక్కా కవల పిల్లలకు జన్మనిచ్చింది. వీరిలో మగ బిడ్డ, మరొకరు ఆడబిడ్డ. మగపిల్లాడు 4lb 10oz బరువుండగా, ఆడ పిల్ల 2lb 7oz బరువు ఉంది. ప్రీమెచ్యూర్ బేబీ కావడంతో.. ఆడపిల్లను మూడు నెలల పాటు ఆస్పత్రిలోనే వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. క్రిస్మస్ రోజున అంటే డిసెంబర్ 25న ఆ చిన్నారిని డిశార్జ్ చేశారు. రెబెక్కాకు జన్మించిన కవల పిల్లలు వైద్య రంగలో అద్భుతమని డాక్టర్లు అంటున్నారు. అంతేకాదు ఇటువంటివి ప్రపంచంలో చాలా అరుదుగా జరిగే సంఘటనలని డాక్టర్లు స్పష్టం చేస్తున్నారు.

Also Read:

విదేశీ మోడల్స్ కు సవాల్ మేడ్ ఇన్ ఇండియా ఈట్రస్ట్ ఎలక్రిక్ బైక్.. ఈ వాహనం స్పెషాలిటీ ఏమిటో తెలుసా..!