Elephants: పండ్లు, కూరగాయలతో ఏనుగులకు భారీ విందు.. ఎక్కడో తెలుసా..?

|

Mar 15, 2022 | 7:01 AM

Elephants: రెండేళ్లుగా కరోనా ఆంక్షలు ఎత్తివేసిన తర్వాత ఆదివారం థాయ్‌లాండ్‌లో ఏనుగులకు విందు ఇచ్చారు. ఇక్కడ చాంగ్ థాయ్ డే జరుపుకొన్నారు. ఏనుగులకు అంకితం చేసిన..

Elephants: పండ్లు, కూరగాయలతో ఏనుగులకు భారీ విందు.. ఎక్కడో తెలుసా..?
Follow us on

Elephants: రెండేళ్లుగా కరోనా ఆంక్షలు ఎత్తివేసిన తర్వాత ఆదివారం థాయ్‌లాండ్‌లో ఏనుగులకు విందు ఇచ్చారు. ఇక్కడ చాంగ్ థాయ్ డే జరుపుకొన్నారు. ఏనుగులకు అంకితం చేసిన ఈ పండుగలో పండ్లు, కూరగాయలను విందుగా అందించారు. థాయ్‌లాండ్‌లోని చోన్‌బురిలో, 60 ఏనుగుల కోసం 8 మీటర్ల వెడల్పు గల టేబుల్‌పై 2 టన్నుల పండ్లు, కూరగాయలను ఉంచారు. ఈ పండుగను ప్రతి సంవత్సరం జాతీయ ఏనుగుల దినోత్సవం (National Elephant Day) సందర్భంగా థాయ్‌లాండ్‌ (Thailand)లోని అనేక ప్రాంతాల్లో జరుపుకుంటారు. అయితే ఏనుగులకు ప్రత్యేక గౌరవం ఇచ్చే రెండు ప్రదేశాలు కూడా ఉన్నాయి. మొదటిది సురిన్, రెండవది చోన్‌బురి ప్రావిన్స్. చోన్‌బురి ప్రావిన్స్‌లో 60, సురిన్‌లో 300 ఏనుగులకు విందు ఏర్పాటు చేశారు. అయితే ఈ పండగను ఎందుకు జరుపుకొంటారో తెలుసుకుందాం.

ఏనుగులు మన దేశానికి గుర్తింపు, గర్వకారణమని థాయ్‌లాండ్ ప్రజలు చెబుతారు. మేము వాటిని రవాణా, అనేక రకాల కార్మిక పనులలో ఉపయోగిస్తాము. ఇది విజయానికి చిహ్నంగా నిలిచింది. వాటి గౌరవార్థం ఈ పండుగను నిర్వహిస్తున్నారు. ఏనుగుల సంరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ పండుగ నిర్వహిస్తామని థాయిలాండ్‌ డిప్యూటీ గవర్నర్ తెలిపారు. ఏనుగులు మన జీవితాలలో, ఉద్యోగాలలో ముఖ్యమైన భాగమని థాయిలాండ్‌ ప్రజలు చెబుతున్నారు. అందుకే ఈ పండుగకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ పండుగను చూసేందుకు దేశంలోనే కాదు, విదేశాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో పర్యాటకులు సూరిన్, చోన్‌బురి చేరుకుంటారు. గత రెండు సంవత్సరాలుగా కరోనా మహమ్మారి కారణంగా, పండుగను నిర్వహించలేదు. కానీ ఈ సంవత్సరం చాలా ఉత్సాహంగా, భారీ ఎత్తున జరుపుకొన్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

ఇవి కూడా చదవండి:

Rare Fish: అరుదైన కొత్త జాతి చేపను కనుగొన్న శాస్త్రవేత్తలు.. దాన్ని చూసేందుకు మీ రెండు కళ్లు చాలవు

Parenting Tips: మీకు అబ్బాయి ఉంటే.. ఈ విషయాలను నేర్పించడం మర్చిపోకండి