కోవిడ్ మూలాలను కనుగొనేందుకు వూహాన్ సిటీని సందర్శించిన ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన నిపుణుల బృందం దీని జంతుమూలాలను కనుగొనలేకపోయిందని చైనా శాస్త్రజ్ఞు డొకరు తెలిపారు. జంతువుల నుంచి ఇది మనుషులకు సంక్రమించే అవకాశాలు ఉన్నప్పటికీ అసలైన మూలాన్ని ఇంకా గుర్తించాల్సి ఉందని చైనా టీమ్ హెడ్ లియాంగ్ వానియన్ చెప్పారు. ఈ వైరస్ మొదట గబ్బిలాలనుంచి.. ఆతరువాత ఓ స్తన్య జీవి నుంచి మానవులకు సోకి ఉండవచ్చునని నిపుణులు భావిస్తున్నారు. 2019 డిసెంబరుకు ముందు కరోనా వైరస్ వూహాన్ లో జనించిందనడానికి ఆధారాలు లేవని లియాంగ్ అన్నారు. డిసెంబరు తరువాతే ఈ వైరస్ కు సంబంధించిన అధికారిక కేసులు నమోదయ్యాయని ఆయన చెప్పారు.
కరోనా వైరస్ మూలాలను కనుగొనడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణుల బృందం చైనాలో పర్యటిస్తోంది. ముఖ్యంగా వూహాన్ లోని వైరాలజీ ఇన్స్ టిట్యూట్ లో ఈ బృంద సభ్యులు సుమారు నాలుగు గంటలు గడిపారు. ఇప్పటికే వీరు ఈ సిటీని విజిట్ చేసి నెల రోజులయ్యాయి. ఈ కాలంలో రెండు వారాలు వారు క్వారంటైన్ లోనే ఉన్నారు. వీరి నుంచి వివరాలు రాబట్టేందుకు జర్నలిస్టులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. చైనా అధికారులు అనుక్షణం వీరి వెంటే ఉండడమే ఇందుకు కారణం.
Read More:కాబోయే యూఎస్ ప్రెసిడెంట్ కీలక ప్రకటన.. చైనా లెక్కలు తేల్చేందుకు డబ్ల్యూహెచ్‌ఓలో చేరుతామన్న బైడెన్..
Read More:కోమాలో ఉన్న యువకుడు.. రెండుసార్లు సోకిన కరోనా.. అయినా కోలుకుంటున్నాడు.. ఎక్కడంటే..