Uttarakhand Floods: ఉత్తరాఖండ్ విషాదంపై భారత్ కు ఎలాంటి సాయమైనా అందిస్తామని మిత్ర దేశాలు ప్రకటించాయి. భారత ప్రజలకు, ఉత్తరాఖండ్ లోని సహాయక బృందాలకు తమ అండ ఉంటుందని బ్రిటిష్ పీఎం బోరిస్ జాన్సన్ ట్వీట్ చేశారు. ఇండియాకు ఎలాంటి సహాయం అవసరమైనా తక్షణమే అందిస్తామని ఆయన అన్నారు. ఇలాగే ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ కూడా హామీ ఇచ్చారు. ఈ క్లిష్ఠ సమయంలో మా మిత్ర దేశానికి, ప్రధాని మోదీకి ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నానని, ఉత్తరాఖండ్ లో గ్లేసియర్ ఔట్ బరస్ట్ కారణంగా 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్టు వఛ్చిన వార్తలు తమను కలచివేశాయని ఆయన అన్నారు. తమ ఆలోచనలు భారత ప్రజల వైపే అని ఆయన ట్వీట్ చేశారు. కరోనా వైరస్ వ్యాక్సిన్ ని ఇండియా నుంచి అందుకుంటున్న వివిధ దేశాలు ఇలా ఈ ఘటనపై తమ స్పందనను తెలియజేస్తున్నాయి.
ఇక ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయెల్ మేక్రోన్, ఇండియాకు జపాన్ రాయబారి సతోషి సుజుకి కూడా ఉత్తరాఖండ్ ఘటనపట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ.. ఇండియాకు ఏ విధమైన సహాయం అవసరమైనా అందిస్తామని ప్రకటించారు. ఇలా ఉండగా.. ఉత్తరాఖండ్ విషాదంలో 125 మంది మిస్సింగ్ అని తెలిసిందని, బాధితులను రక్షించేందుకు సహాయక బృందాలు నిర్విరామంగా శ్రమిస్తున్నాయని ఈ రాష్ట్ర సీఎం త్రివేంద్ర సింగ్ రావత్ వెల్లడించారు. కేంద్రం కూడా ఎప్పటికప్పుడు ఈ ఘటనపై తమనుంచి వివరాలు తెలుసుకుంటోందని ఆయన చెప్పారు.
My thoughts are with the people of India and rescue workers in Uttarakhand as they respond to devastating flooding from the glacier collapse. The UK stands in solidarity with India and is ready to offer any support needed.
— Boris Johnson (@BorisJohnson) February 7, 2021
Also Read:
సంగీతానికి చింతకాయలు రాలవు.. ఉద్యోగంలో ఉంటావా.. పోతావా..? అధికారులపై ఎమ్మెల్యే ఆగ్రహం