
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లో మళ్లీ వర్షాలు దంచికొడుతున్నాయి. శుక్రవారం (డిసెంబర్ 19) ఉదయం నుంచి అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అబుదాబీ, దుబాయ్ సహా పలు నగరాల్లో భారీ వర్షం కారణంగా రోడ్లు జలమయం అయ్యాయి. కొన్ని గంటలపాటు జనజీవనం స్తంభించిపోయింది. అనేకచోట్ల ట్రాఫిక్‌కు అంతరాయం కలగడం ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. అంతేకాకుండా శుక్రవారం పలు విమాన సర్వీసులు కూడా రద్దు అయ్యాయి. భారీ వర్షాలకు పర్యాటక కేంద్రాలు సైతం స్తంభించిపోయాయి. హాలీడే సీజన్‌కు సిద్ధమవుతున్న వేళ భారీ వర్షాలు కురుస్తుండడంతో అక్కడి ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. భారీ వర్షాలు, వరదలను ఎదుర్కోవడానికి ఏర్పాట్లు చేస్తున్నాయి. ఎందుకంటే ఆ దేశంలో ఇలాంటి వాతావరణ సంఘటనలు తరచూ పునరావృతమవుతున్నాయి.
అబుదాబీ, దుబాయ్‌లలో కురిసిన భారీ వర్షానికి అనేక లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దుబాయ్‌లో భారీ వర్షం కురవగా.. అబుదాబిలో ఉరుములతో కూడిన వర్షాలు కురిశాయి. దీంతో వరదలు వచ్చే ప్రాంతాలకు దూరంగా ఉండాలని అధికారులు వాహనదారులకు సూచించారు. ఇక ప్రభుత్వ ఉద్యోగులు ఇంటి నుంచే రిమోట్ వర్క్ చేయాలని దుబాయ్ ప్రభుత్వం ఆదేశించింది. ప్రైవేట్ కంపెనీలు కూడా ఇదే విధానాన్ని పాటించాలని కోరింది. అవసరమైతేతప్ప బయటకు రావొద్దని, అప్పటి వరకు ప్రజలు ఇళ్లలోనే ఉండాలని పేర్కొంది. బీచ్‌లు, పార్కులు, పర్యాటక ప్రదేశాలను కూడా తాత్కాలికంగా మూసివేసింది.
గల్ఫ్ లో ఈ మధ్య కాలంలో తరచుగా తీవ్రమైన వాతావరణ పరిస్థితులు నెలకొంటున్నాయి. స్వల్ప సమయంలోనే కుండపోత వర్షాలు నీటి ఎద్దడికి కారణమవుతున్నాయి. దీంతో సాధారణ జనజీవనానికి అంతరాయం కలిగిస్తున్నాయి. నగర మౌలిక సదుపాయాలు శుష్క పరిస్థితులకు అనుగుణంగా రూపొందించబడ్డాయి. అంటే దుబాయ్‌ల పెద్ద మొత్తంలో వర్షపాతం కురిసినప్పుడు డ్రైనేజీ వ్యవస్థ సమర్థవంతంగా పనిచేయదు. అక్కడి వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా దుబాయ్ ప్రభుత్వం ఈ విధంగా రూపొందించింది. అయితే ఎప్పుడూ అతి తక్కువగా అరకొర వర్షపాతం నమోదయ్యే ఈ ఏడాది దేశంలో ఈ మధ్యకాలంలో వానలు దంచికొడుతున్నాయి. మారుతున్న వాతావరణాన్ని తట్టుకునే విధంగా మౌలిక సదుపాయాలు రూపొందించడం అవసరమని అక్కడి ప్రభుత్వం భావిస్తుంది.
#أمطار_الخير #وادي_البيح #وادي_شحة #المركز_الوطني_للأرصاد #أصدقاء_المركز_الوطني_للأرصاد #حالة_الطقس #حالة_جوية #هواة_الطقس #reel #دبي #الإمارات_العربية_المتحدة #أبوظبي #الشارقة #رأس_الخيمة #الفجيرة #عجمان #أم_القيوين pic.twitter.com/4zaFdfB1az
— المركز الوطني للأرصاد (@ncmuae) December 19, 2025
ఏప్రిల్ 2024లో భారీ వర్షాలు దుబాయ్ దేశాన్ని అతలాకుతలం చేశాయి. దుబాయ్ వీధులు వరదల్లో మునిగిపోయాయి. శుక్రవారం వర్షాలు మరోసారి అదే ఆందోళనలను తెరపైకి తీసుకొచ్చింది. యేటా ఇటువంటి సంఘటనలు జరిగితే పరిస్థితిని ఎదుర్కోవడానికి అధికారులు తగిన మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. వరద తీవ్రతను తక్కువ అంచనా వేయొద్దని, ప్రమాదకరంగా ఉండొచ్చని షార్జా సివిల్ డిఫెన్స్ అథారిటీ (SCDA) సూచించింది.
మరిన్ని అంతర్జాతీయ కథనాల కోసం క్లిక్ చేయండి.