Virginia Walmart Shooting: అగ్రరాజ్యం అమెరికాలో గన్ కల్చర్ దడపుట్టిస్తోంది. తాజాగా.. అమెరికాలోని వర్జీనియాలోని చీసాపీక్ లో కాల్పులు కలకలం రేపాయి. వాల్‌మార్ట్ స్టోర్‌లో పనిచేస్తున్న మేనేజర్ తోటి ఉద్యోగులపై కాల్పులతో తెగబడ్డాడు. ఈ కాల్పుల్లో 14 మంది చనిపోయినట్టు తెలుస్తోంది. ఈ ఘటనలో పలువురు మృతిచెందగా.. పదుల సంఖ్యలో గాయపడ్డారు. కాల్పుల అనంతరం అతను కూడా కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటీనా ఘటనా స్థలానికి చేరుకున్నారు. సామ్ సర్కిల్‌లోని వాల్‌మార్ట్ దగ్గర భయానక పరిస్థితులు నెలకొన్నాయి. కాల్పులు ఘటన జరిగిన సమయంలో వాల్‌మార్ట్ తెరిచే ఉందని యూఎస్ పోలీసులు తెలిపారు. చీస్‌పీక్ ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు తెలిపారు. వాల్‌మార్ట్ స్టోర్ దగ్గరకు భారీ సంఖ్యలో అంబులెన్సులు, పోలీసులు చేరుకున్నారు. మృతులను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని చీస్ పిక్ పోలీసులు తెలిపారు.
అమెరికా కాలమానం ప్రకారం.. మంగళవారం రాత్రి స్టోర్ మేనేజర్ బ్రేక్ రూంలోకి వెళ్లి అక్కడున్నవారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపినట్లు పోలీసులు వెల్లడించారు. దాదాపు 35 నుంచి 40 నిమిషాల పాటు జరిపిన కాల్పుల్లో పలువురు ప్రాణాలు కోల్పోయారన్నారు. అక్కడికి చేరుకునే లోపే నిందితుడు ఆత్మహత్య చేసుకున్నాడని వెల్లడించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
BREAKING?: A mass shooting has occurred at a Walmart in Chesapeake, Virginia. Video we’ve obtained from Walmart employees outside the store show multiple police cars arriving and also employees recounting what happened. pic.twitter.com/dB4X4ii9yE
— Officer Lew (@officer_Lew) November 23, 2022
వాల్‌మార్ట్ స్టోర్‌లో కాల్పులు సమయంలో చాలామంది వినియోగదారులు అక్కడే ఉన్నారు. బుల్లెట్ల వర్షం కురియడంతో వాళ్లు ప్రాణాలు కాపాడుకోవడానికి పరుగులు పెట్టారు.
అమెరికాలో ఎన్ని చట్టాలు తీసుకొచ్చినప్పటికి గన్ కల్చర్‌కు అడ్డుకట్టవేయలేకపోతున్నారు. రెండు రోజుల క్రితం నైట్‌క్లబ్‌లో కాల్పులు జరిగాయి. కొలరాడో నైట్‌క్లబ్‌లో జరిగిన కాల్పుల్లో ఐదుగురు చనిపోయారు. 16 మందికి గాయాలయ్యాయి.
వర్జీనియా లోనే కొద్దిరోజుల క్రితం ఫుట్‌బాల్ టీమ్‌పై మాజీ ప్లేయర్ కాల్పులు జరిపిన ఘటన తీవ్ర కలకలం రేపింది. కాల్పుల్లో ముగ్గురు ఆటగాళ్లు చనిపోయారు. ఇది జరిగిన కొద్దిరోజులకే వాల్‌మార్ట్ స్టోర్‌లో కాల్పులు తీవ్ర కలకలం రేపాయి.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం..