Celebrity Duck: అందమైన జంతువులు అవి చేసే పనుల వీడియోలు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి. జంతువులు చేసే చిలిపిపనుల వీడియోలను నెటిజన్లు అధిక సంఖ్యలో చూస్తారుకూడా. ఇలాంటి వీడియోలు చూపరుల మనసుని ప్రశాంతంగా ఉంచుతాయి. మానసిక ఒత్తిడిని దూరం చేస్తాయి. కొన్ని కొన్ని జంతువులు సోషల్ మీడియాలో సెలబ్రెటీ రేంజ్ లో అభిమానులు సంపాదించుకుంటున్నాయి. తాజాగా ‘మంచ్‌కిన్ ఓ రేంజ్ లో ఫేమస్ అయ్యింది. ‘మంచ్‌కిన్’ ఎవరంటే ఒక బాతు. అవును పెన్సిల్వేనియాలోని మిల్‌ఫోర్డ్‌లో ‘మంచ్‌కిన్’ చాలా ఫేమస్. 20 యేళ్ల క్రిస్సీ ఎలిస్ అనే యువతి పెంపుడు జంతువు. ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత ఎక్కువగా కష్టపడే పెంపుడు జంతువుగా ఫేమస్ అయ్యింది. అంతేకాదు తన యజమానురాలి ఆదాయాన్ని కూడా సంపాదించి పెడుతుంది.
క్రిస్సీ తన బాల్యం నుండి బాతులను పెంచే అలవాటుంది. అయితే క్రిస్సీ టీనేజ్‌లో ఉన్నప్పుడు మంచ్‌కిన్ వచ్చింది. క్రిస్సీ ఫోటోలు, వీడియో తీస్తుంటే.. మంచ్‌కిన్ కెమెరా ముందు పోజులివ్వడం మొదలు పెట్టింది. దీంతో వీరిద్దరికి కలిపి సోషల్ మీడియాలో ప్రత్యేకంగా వీరిద్దరికీ కలిపి ‘డంకిన్ డక్స్’ అనే పేరుతో కామన్ ఎకౌంట్ తెరచింది. అప్పటినుంచి వీరిద్దరి ఫొటోలను, వీడియోలను సోషల్ మీడియలో పోస్ట్ చేయడం ప్రారంభించింది.
ఇప్పుడు ఈ ఉమ్మడి ఖాతా డంకిన్ డక్స్ ఇన్‌స్టాగ్రామ్ పేజీకి టిక్‌టాక్‌లో 2,54,000 మంది ఫాలోవర్లు, 2.7 మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. రోజు రోజుకీ బాతు వీడియోలు క్రేజ్ ను సొంతం చేసుకుంటున్నాయి.
ఈ నేపథ్యంలో తన యజమానికి క్రిస్సీ నెలకు ఏకంగా రూ. 3,34,363లను సంపాదించి పెడుతుంది. మరోవైపు మంచ్‌కిన్ పెయింటింగ్స్ ద్వారా కూడా డబ్బు సంపాదిస్తోంది. దీంతో న్యూయార్క్ లో ప్రముఖ పేపర్ ‘కష్టపడి పనిచేసే పెట్’ అని పేర్కొంది.
Also Read: భార్యతో అంత ఇష్టం అంటున్న భీమ్లా నాయక్.. దసరాకు చిత్ర యూనిట్ ట్రీట్