EV Battery Charger Video: ప్రపంచం లోనే.. ఫస్ట్ టైం.. 3 నిమిషాలు ఛార్జ్‌ చేస్తే చాలు.. 100 కి.మీ. ప్రయాణించొచ్చు..!(వీడియో)

EV Battery Charger Video: ప్రపంచం లోనే.. ఫస్ట్ టైం.. 3 నిమిషాలు ఛార్జ్‌ చేస్తే చాలు.. 100 కి.మీ. ప్రయాణించొచ్చు..!(వీడియో)

Anil kumar poka

|

Updated on: Oct 05, 2021 | 8:51 PM

ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఎలక్ట్రిక్ కార్ చార్జర్‌ వచ్చేసింది. స్విస్ కంపెనీ ఏబీబీ తయారుచేసిన ఈ ఛార్జర్ ఎలక్ట్రిక్ కారును 15 నిమిషాలకంటే తక్కువ టైంలోనే పూర్తిగా ఛార్జ్ చేస్తుంది. అంతేకాదు ఈ ఛార్జర్‌తో ఎలక్ట్రిక్ కారును 3 నిమిషాల పాటు ఛార్జ్ చేస్తే చాలు 100 కి.మీ.

ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఎలక్ట్రిక్ కార్ చార్జర్‌ వచ్చేసింది. స్విస్ కంపెనీ ఏబీబీ తయారుచేసిన ఈ ఛార్జర్ ఎలక్ట్రిక్ కారును 15 నిమిషాలకంటే తక్కువ టైంలోనే పూర్తిగా ఛార్జ్ చేస్తుంది. అంతేకాదు ఈ ఛార్జర్‌తో ఎలక్ట్రిక్ కారును 3 నిమిషాల పాటు ఛార్జ్ చేస్తే చాలు 100 కి.మీ. ప్రయానిస్తుందని సంస్థ తెలిపింది. ఈ ఛార్జర్ పేరు టెర్రా 360 మాడ్యులర్, ఈ ఛార్జర్‌తో ఒకేసారి 4 వాహనాలను ఛార్జ్ చేయవచ్చట.

ఏబీబీ టెర్రా 360 ఛార్జర్ లో ఉండే వినూత్న లైటింగ్ సిస్టమ్ వినియోగదారులకు ఈవీ బ్యాటరీ ఛార్జింగ్ స్థితిని, ఈవీ పూర్తిగా ఛార్జ్ కావడానికి పట్టే సమయాన్ని చూపుతుందట. దీనిని ఏర్పాటు చేసుకోడానికి ఎక్కవ స్థలం కూడా పట్టదట. ఇది చిన్న స్పేస్ పార్కింగ్, ఆఫీస్ కాంప్లెక్స్ లేదా మాల్ వంటి ఏదైనా వాణిజ్య ప్రదేశంలో ఇన్‌స్టాల్ చేసుకోవచ్చట. ABB ట్రక్కులు, ఓడలు, రైల్వేలు వంటి వాణిజ్య వాహనాలతో పాటుగా మౌలిక సదుపాయాలు, ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ కోసం విద్యుత్‌ను అందిస్తుంది. ABB చెబుతున్న దాని ప్రకారం, కొత్త ఛార్జర్ గరిష్ట ఉత్పత్తి 360 కిలో వాట్స్‌గా చెబుతున్నారు. 2010 లో ఈవీ మార్కెట్‌లోకి వచ్చిన ఏబీబీ 4 లక్షలకు పైగా ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జర్‌లను విక్రయించింది. ఇక ఈ ఏడాది చివరి నాటికి కొత్త టెర్రా 360 ఛార్జర్‌ను యూరప్‌కు సరఫరా చేయడం ప్రారంభిస్తుందట. అమెరికా, లాటిన్ అమెరికా మరియు ఆసియా దేశాలలో అందుబాటులోకి వస్తుందని తెలిపారు. 
మరిన్ని చదవండి ఇక్కడ : Shaheen Cyclone: గులాబ్ తుఫాన్ భీభత్సం నుంచి కోలుకోకముందే.. మరో తుఫాన్.. ఆదేశించిన ప్రభుత్వం..(వీడియో)

 Vice President Venkaiah Naidu: మనుగడ నుండి అభినృద్ధి వైపు.. వెంకయ్య నాయిడు ప్రారంభించిన యూబీఎఫ్ హెల్ప్ లైన్.. (వీడియో)

 Bigg Boss 5 Telugu: బిగ్ బాస్‌ హౌస్‌లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీగా.. విష్ణు ప్రియ.. ప్రూఫ్ ఇదిగో.. (వీడియో)

 Allu Arjun-Allu Ramalingaiah: తాతపై ఉన్న ప్రేమను.. బన్నీ ఇలా బయటపెట్టాడు.. చరిత్రలో నిలిచిపోయేలా..(వీడియో)