Shaheen Cyclone: గులాబ్ తుఫాన్ భీభత్సం నుంచి కోలుకోకముందే.. మరో తుఫాన్.. ఆదేశించిన ప్రభుత్వం..(వీడియో)
గులాబ్ తుఫాన్ భీభత్సం నుంచి కోలుకోకముందే.. తీరంలో షహీన్ తుఫాన్ అలజడి సృష్టిస్తోంది. గుజరాత్ తీరంలో ఈశాన్య అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం వచ్చే 12 గంటల్లో తీవ్ర అల్పపీడనంగా మారుతుందని భారత వాతావరణ శాఖ ఐఎండీ హెచ్చరించింది.
గులాబ్ తుఫాన్ భీభత్సం నుంచి కోలుకోకముందే.. తీరంలో షహీన్ తుఫాన్ అలజడి సృష్టిస్తోంది. గుజరాత్ తీరంలో ఈశాన్య అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం వచ్చే 12 గంటల్లో తీవ్ర అల్పపీడనంగా మారుతుందని భారత వాతావరణ శాఖ ఐఎండీ హెచ్చరించింది. ఇది పశ్చిమ-వాయువ్య దిశగా పాకిస్తాన్-మక్రాన్ తీరాల వైపు కొనసాగే అవకాశం ఉందని తెలిపింది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున.. గుజరాత్ తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మత్స్యకారులు సముద్రంలోకి ఎవరూ వేటకు వెళ్లరాదని హెచ్చరించింది.
ఇప్పటికే సముద్రంలోకి వెళ్లిన వారు తిరిగి రావాలంటూ హెచ్చరికలు జారీ చేశారు. అల్పపీడనం కారణంగా గుజరాత్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అక్టోబరు 1, 2 తేదీల్లో రాష్ట్రంలోని తీర ప్రాంత జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని.. ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ సూచనలు చేసింది. కోస్తా జిల్లాలైన జామ్‌నగర్, పోర్‌బందర్, ద్వారకా, కచ్‌లో భారీ వర్షాలు కురుస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. తీర ప్రాంతాల్లో బలమైన గాలులు కూడా వీచే అవకాశముందని ఐఎండీ హెచ్చరించింది.
మరిన్ని చదవండి ఇక్కడ : Vice President Venkaiah Naidu: మనుగడ నుండి అభినృద్ధి వైపు.. వెంకయ్య నాయిడు ప్రారంభించిన యూబీఎఫ్ హెల్ప్ లైన్.. (వీడియో)