Pea in Lungs: వైద్య చరిత్ర విచిత్ర ఘటన.. క్యాన్సర్ అని వెళ్లిన తాతకు షాకింగ్ న్యూస్.. అసలేం జరిగిందంటే

|

Apr 25, 2023 | 11:16 AM

కడుపులో విత్తనం మొక్క అవ్వడం పూర్తిగా అబద్ధం. మన పొట్టలోకి ఏదైనా గింజ వెళ్తే.. అది చిన్న చిన్న ముక్కలుగా అయి విసర్జింపబడుతుంది. కనుక కడుపులోకి వెళ్లిన ఏ విత్తనం మొక్కగా మొలకెత్తదు. దీని వల్ల ఎవరి కడుపులోనూ చెట్టు పెరగదు ఇది అందరి నమ్మకం.. ఈ నమ్మకాన్ని సవాల్ చేస్తూ.. వైద్య విజ్ఞాన చరిత్రలో విచిత్ర ఘటన ఒకటి చోటు చేసుకుంది. అయితే విత్తనం మొలకెత్తింది కడుపులో కాదు.. ఊపిరితిత్తుల్లో. అమెరికాలోని మసాచుసెట్స్ రాష్ట్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

Pea in Lungs: వైద్య చరిత్ర విచిత్ర ఘటన.. క్యాన్సర్ అని వెళ్లిన తాతకు షాకింగ్ న్యూస్.. అసలేం జరిగిందంటే
Pea Plant In Lungs
Follow us on

మీరు మీ చిన్నతనంలో చాలా విషయాలు విని ఉంటారు. పెద్దయ్యాక తాము చిన్న తనంలో విన్న కొన్ని విషయాల్లో నిజం లేదని తెలుసుకుంటారు. చిన్నతనంలో తమ ఆలోచనలను తల్చుకుని నవ్వుకుంటారు. అటువంటి అపోహలో ఒకటి.. ఏదైనా పండ్ల గింజ కడుపులోకి వెళ్లిపోవడం .. అది మొక్క అవుతుందని అని నమ్మకం.  పండ్ల గింజలు మన కడుపులోకి వెళ్లి  చెట్లు పెరుగుతాయని వినడం.. ఆ మాటలను నమ్మడం ప్రతి ఒక్కరి బాల్యం లో చోటు చేసుకున్న ఘటన. అయితే కడుపులో విత్తనం మొక్క అవ్వడం పూర్తిగా అబద్ధం. మన పొట్టలోకి ఏదైనా గింజ వెళ్తే.. అది చిన్న చిన్న ముక్కలుగా అయి విసర్జింపబడుతుంది. కనుక కడుపులోకి వెళ్లిన ఏ విత్తనం మొక్కగా మొలకెత్తదు. దీని వల్ల ఎవరి కడుపులోనూ చెట్టు పెరగదు.

అయితే  వైద్య విజ్ఞాన చరిత్రలో విచిత్ర ఘటన ఒకటి చోటు చేసుకుంది. అయితే విత్తనం మొలకెత్తింది కడుపులో కాదు.. ఊపిరితిత్తుల్లో. అమెరికాలోని మసాచుసెట్స్ రాష్ట్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బ్రూస్టర్‌కు చెందిన రిటైర్డ్ ఉపాధ్యాయుడు రాన్ స్వెడెన్ శ్వాస తీసుకోవడంలో చాలా ఇబ్బంది ఏర్పడుతుండడంతో ఊపిరితిత్తుల్లో కణితి పెరుగుతుందని భావించాడు. అయితే అది బఠానీ మొక్క అని తెలుసుకుని ఆశ్చర్యపోయాడు.

75 ఏళ్ల స్వీడెన్ ఊపిరితిత్తులలో బఠానీ గింజ నుంచి మొలకెత్తింది. ఇది దాదాపు అర అంగుళం పొడవు (సుమారు 1.25 సెం.మీ.) ఉంది అని NBC వార్తా పత్రిక వెల్లడించింది.  స్వీడెన్ చాలా నెలలు ఊపిరి పీల్చుకునే సమయంలో ఇబ్బంది పడేవాడు. విపరీతమైన దగ్గు, నీరసంతో ఇబ్బంది పడేవాడు. దీంతో  అతని భార్య నాన్సీ 911కి కాల్ చేసి ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు  స్వీడెన్ కు  ఎక్స్-రేలు తీశారు. అతని ఎడమ ఊపిరితిత్తు క్షీణించిందని.. ఎక్స్-రేలో గ్రెయిన్ స్పాట్ కనిపించిందని వైద్యులు గుర్తించారు.

ఇవి కూడా చదవండి

మరో రెండు వారాల పరీక్షలు జరిపారు. స్వీడెన్ ఊపిరితిత్తుల క్యాన్సర్ అని భావించి క్యాన్సర్ నిర్ధారణ కోసం తనను తాను సిద్ధం చేసుకున్నాడు. అయితే అతనికి క్యాన్సర్ లక్షణాలు లేవని తేలింది. అప్పుడు ఒక వైద్యుడు అతని ఊపిరితిత్తులలో ఒక మొక్క పెరుగుతున్నట్లు కనుగొన్నాడు.

స్వీడన్ తినే సమయంలో ఏర్పడిన ఇబ్బందితో ఒక బఠాణీ అతని ఊపిరితిత్తుల్లోకి చేరుకుంది. ఊపిరితిత్తుల్లో తేమ , వెచ్చని పరిస్థితులతో బఠాణీ మొలకెత్తి.. పెరగడం మొదలు పెట్టింది.

అయితే ఈ మార్పులు ఏవీ స్వెడెన్ ఛాతీపై ప్రభావం చూపించలేదు. అయితే విపరీతమైన దగ్గుతో బాధపడుతున్నాడు. దీంతో వైద్యులు శస్త్ర చికిత్స చేసి బఠానీని తొలగించారు.  ప్రస్తుతం ఇంటి వద్ద కోలుకుంటున్నాడు. తన శస్త్రచికిత్స అనంతరం తాను ఆసుపత్రిలో చేసిన మొదటి భోజనంలో బఠానీలు ప్రధాన కూరగాయ కావడంతో తాను చాలా సంతోషించానని చెప్పాడు. వాటిని తిన్నప్పుడు తనలో తాను నవ్వుకున్నానని చెప్పాడు.

స్వీడెన్ స్నేహితులు కూడా ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయి ఇంటికి వచ్చిన అతనికి బఠాణీలు గింజలు గిఫ్ట్ గా పంపించారు. తమాషా చేశారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..