Vijay Mallya: లండన్ హైకోర్టులో విజయ్ మాల్యాకు ఎదురు దెబ్బ.. బ్యాంకుల సవరణలకు ఓకే చెబుతూ..

UK high court - Vijay Mallya : విజయ్ మాల్యాకు లండన్ హైకోర్టులో చుక్కెదురైంది. భారతీయ స్టేట్ బ్యాంకు (ఎస్‌బీఐ) నేతృత్వంలోని భారతీయ బ్యాంకుల కన్సార్షియానికి అనుకూలంగా

Vijay Mallya: లండన్ హైకోర్టులో విజయ్ మాల్యాకు ఎదురు దెబ్బ.. బ్యాంకుల సవరణలకు ఓకే చెబుతూ..
Vijay Mallya

Edited By: Ram Naramaneni

Updated on: May 19, 2021 | 9:07 AM

UK high court – Vijay Mallya : విజయ్ మాల్యాకు లండన్ హైకోర్టులో చుక్కెదురైంది. భారతీయ స్టేట్ బ్యాంకు (ఎస్‌బీఐ) నేతృత్వంలోని భారతీయ బ్యాంకుల కన్సార్షియానికి అనుకూలంగా తీర్పు వెలువడింది. భారత దేశంలోని మాల్యా ఆస్తులపై తమ సెక్యూరిటీ హక్కులను వదులుకోవడానికి ఈ కన్సార్షియంలోని బ్యాంకులకు హైకోర్టు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దివాలా పిటిషన్‌లో దీనికి సంబంధించిన సవరణలు చేసేందుకు బ్యాంకులకు అనుమతినిచ్చింది. దీంతో కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ కోసం మాల్యాకు ఇచ్చిన రుణాలను తిరిగి రాబట్టుకునేందుకు ఎస్‌బీఐకు ఓ అడుగు ముందుకు పడినట్లయింది.

బ్యాంకుల కన్సార్షియానికి అనుకూలంగా చీఫ్ ఇన్‌సాల్వెన్సీస్ అండ్ కంపెనీస్ కోర్టు (ఐసీసీ) జడ్జి మైఖేల్ బ్రిగ్స్ తీర్పును వెలువరించారు. తమ సెక్యూరిటీ హక్కులను వదులుకోవడాన్ని నిరోధించే పబ్లిక్ పాలసీ ఏదీ లేదని బ్రిగ్స్ పేర్కొన్నారు. మాల్యా దివాలా తీసినట్లుగా ఆదేశాలు ఇవ్వడానికి మద్దతుగా, వ్యతిరేకంగా జూలై 26న తుది వాదనలు వినిపించాలని స్పష్టంచేశారు. కాగా.. ఈ విచారణ వర్చువల్ పద్ధతిలో మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా బ్యాంకుల తరపున న్యాయవాది మాట్లాడుతూ.. ప్రజలు మర్చిపోయే వరకు సాగదీయాలని మాల్యా ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. తాము దాఖలు చేసిన దివాలా పిటిషన్‌ను పరిష్కరించాలంటూ బ్యాంకులు కోరాయి.

బ్యాంకులు దాఖలు చేసిన పిటిషన్‌ను సవరించేందుకు అనుమతిస్తున్నట్లు ధర్మాసంన వెల్లడించింది. దివాలా ఆదేశాలు జారీ అయ్యే సందర్భంలో, తమకుగల సెక్యూరిటీని అమలు చేసే పిటిషనర్లు (బ్యాంకులు).. దివాలా తీసినవారి రుణదాతల నుంచి ప్రయోజనం కోసం సవరణలు చేసుకోవచ్చని తెలిపింది. పిటిషనర్లు తమ సెక్యూరిటీని వదులుకోవడాన్ని నిరోధించే చట్టపరమైన నిబంధనలేవీ లేవని ఈ తీర్పులో న్యాయస్థానం స్పష్టంచేసింది.

Also Read:

Mamata Banerjee: బెంగాల్‌లో సుపరిపాలన అందించాలంటే.. గవర్నర్‌ను మార్చండి.. రాష్ట్రపతి, ప్రధానికి మమతా లేఖ..

సింగపూర్ లో 12-15 ఏళ్ళ మధ్య వయస్కులకు వ్యాక్సినేషన్, యుధ్ధ ప్రాతిపదికన చేపడతామన్న ప్రభుత్వం, అమెరికా పంథాను అనుసరిస్తున్న నిపుణులు