ప్రకృతిలో వచ్చిన మార్పులు జీవరాశులపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. తాజాగా ఓ బీచ్ లో వేల కొద్దీ చేపలు మరణించాయి. చేపలకు ఆక్సిజన్ అందక మరణించాయని చెబుతున్నారు. ఈ ఘటనలో అమెరికాలోని టెక్సాస్‌లోని గల్ఫ్ కోస్ట్ బీచ్‌లో గత వారం చోటు చేసుకుంది. బ్రియాన్ బీచ్ చివరిలో మెన్‌హాడెన్ చేపలు చనిపోయాయని అవుట్‌లెట్ కు చెందిన స్థానిక అధికారులు చెప్పారు. ఒకేసారి ఇన్ని చేపలు చనిపోవడానికి కారణమేంటని అధికారులను అడిగితే గోరువెచ్చని నీటిలో ఆక్సిజన్ అందక చనిపోయాయని చెప్పారు. చేపలకు చల్లటి నీటిలో వాటికి తగినంత ఆక్సిజన్ లభిస్తుంది.
అలాగే 70 డిగ్రీల ఫారెన్‌హీట్ కంటే ఎక్కువ నీటిలో ఉష్ణోగ్రత పెరిగినప్పుడు.. మెన్‌హేడెన్ చేపలు జీవించడానికి తగినంత ఆక్సిజన్‌ను పొందడం కష్టమవుతుందని తెలిపారు. మెన్‌హాడెన్ చేపలు ఎక్కువగా కెనడా నుండి దక్షిణ అమెరికా వరకు కనిపిస్తాయి. “అయితే ఎండిపోతున్న సరస్సులోని నీరు.. లోతైన నీటి కంటే త్వరగా వేడెక్కుతుంది. కనుక ఈ మెన్‌హాడెన్ చేపలు తక్కువ లోతు ఉన్న సరస్సులో చిక్కుకుంటే, చేపలు హైపోక్సియాతో బాధపడతాయి” అని అధికారులు ఫేస్‌బుక్ పోస్ట్‌లో వెల్లడించారు.
ఆక్సిజన్ అందక మరణించిన చేపలు
సమాచారం ప్రకారం ఆక్సిజన్ అందకపోవడం వలన చేపలు భయపడతాయి .. కంగారు పడతాయి. దీంతో ఆక్సిజన్ స్థాయి మరింత తగ్గుతుంది. వాతావరణ మార్పుల కారణంగా నీటి ఉష్ణోగ్రత మారడం.. నీరు మరింత వేగంగా వేడెక్కడం ప్రారంభిస్తుంది. అప్పుడు ఆ నీటిలో ఉన్న చేపలు ఊపిరి అందక మరణిస్తాయి. ఇటువంటి సంఘటనలు వేగంగా పెరుగుతాయని ఒక అధికారి తెలిపారు.
ఆ చేపకు ఓర్ ఫిష్ అని పేరు పెట్టారు
చిలీ మత్స్యకారులు ఇటీవల చాలా పెద్ద చేపను పట్టుకున్నారు. ఈ చేప పొడవు 16 అడుగుల వరకు ఉంటుందని తెలిపారు. ఈ చెపను పట్టుకునేందుకు క్రేన్‌ను ఉపయోగించాల్సి వచ్చింది. ఈ ఘటనను స్థానికులు కెమెరాలో బంధించి వైరల్ చేశారు.
పట్టుకున్న చేప పేరు ఓర్ ఫిష్. అప్పట్లో దీని పొడవు 36 అడుగులు ఉండేదని.. ఈ తరహా చేపలు లోతైన సముద్రాల్లో లభ్యమవుతాయి. చాలా అరుదైన చేప జాతులు, ఇది మొదటిసారిగా ఏప్రిల్‌లో న్యూజిలాండ్‌లోని బీచ్‌లో కనిపించింది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..