Planes Crash: ఆకాశంలో ఢీకొని కుప్పకూలిన రెండు చిన్న విమానాలు.. ముగ్గురు దుర్మరణం

|

Sep 18, 2022 | 7:28 PM

ఒక విమానం శిధిలాల్లో ఇద్దరు వ్యక్తుల మృతదేహాలు లభించాయి. మరో విమానంలో ఉన్న పైలట్ తీవ్రంగా గాయపడి ఉండటంతో అతన్ని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.

Planes Crash: ఆకాశంలో ఢీకొని కుప్పకూలిన రెండు చిన్న విమానాలు.. ముగ్గురు దుర్మరణం
Plane Crash
Follow us on

Planes Crash: రెండు చిన్న విమానాలు ఆకాశంలోనే ఢీకొన్నాయి. ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మృత్యువాతపడ్డారు. ఈ మేరకు స్థానిక అధికారులు వివరాలు వెల్లడించారు. ఈ షాకింగ్‌ సంఘటన అమెరికాలోని డెన్వర్ సమీపంలో శనివారం రోజున జరిగింది. నలుగురు వ్యక్తులు సులువుగా కూర్చుని ప్రయాణించగల సెస్నా 172 విమానం గాల్లో ఉండగా.. మరో చిన్న విమానం సోనెక్స్ జీనోస్ దాన్ని ఢీకొట్టింది. ఉదయం ఆకాశంలో ఎగురుతున్న ఈ రెండు విమానాలు అకస్మాత్తుగా ఢీకొన్నాయి. ఈ సమయంలో సంభవించిన పేలుడు శబ్దానికి స్థానిక ప్రజలు భయంతో పరుగులు తీశారు.

సమీపంలోనే కూలిపోయిన ఈ విమానాలను అధికారులు పరిశీలించగా.. ఒక విమానం శిధిలాల్లో ఇద్దరు వ్యక్తుల మృతదేహాలు లభించాయి. మరో విమానంలో ఉన్న పైలట్ తీవ్రంగా గాయపడి ఉండటంతో అతన్ని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అతను కూడా మరణించినట్లు సమాచారం. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి