United States: అబార్షన్లపై అమెరికా సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. నో అన్న బైడెన్, ఓకే అన్న ట్రంప్

అబార్షన్లపై అమెరికా సుప్రీంకోర్టు(US Supreme Court) సంచలన తీర్పు వెల్లడించింది. ఆ దేశంలో అబార్షన్‌ చేయించుకునేందుకు వీలుగా మహిళలకు దాదాపు 50 ఏళ్లుగా అందుబాటులో ఉన్న రాజ్యాంగపరమైన రక్షణలకు ముగింపు పలికింది. అబార్షన్లను...

United States: అబార్షన్లపై అమెరికా సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. నో అన్న బైడెన్, ఓకే అన్న ట్రంప్
Abortiions In America

Updated on: Jun 25, 2022 | 9:41 AM

అబార్షన్లపై అమెరికా సుప్రీంకోర్టు(US Supreme Court) సంచలన తీర్పు వెల్లడించింది. ఆ దేశంలో అబార్షన్‌ చేయించుకునేందుకు వీలుగా మహిళలకు దాదాపు 50 ఏళ్లుగా అందుబాటులో ఉన్న రాజ్యాంగపరమైన రక్షణలకు ముగింపు పలికింది. అబార్షన్లను(Abortions in US) నిషేధించే విషయంలో రాష్ట్రాలు స్వయంగా నిర్ణయం తీసుకోవచ్చని స్పష్టం చేసింది. 5-3 మెజార్టీతో సంబంధిత తీర్పు వెలువడింది. దీంతో దేశవ్యాప్తంగా దాదాపు 25 రాష్ట్రాలు గర్భవిచ్ఛిత్తిపై త్వరలోనే నిషేధాజ్ఞలు విధించే అవకాశాలున్నాయి. సుప్రీం తీర్పును అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ తప్పుపట్టారు. మాజీ అధ్యక్షుడు ట్రంప్‌ మాత్రం హర్షం వ్యక్తం చేశారు. అమెరికాలో అబార్షన్లనేవి రాజ్యాంగపరమైన హక్కు. ఆ దేశ రాజ్యాంగం ప్రకారం.. అబార్షన్లకు చట్టబద్ధత ఉండేది. 50 సంవత్సరాల నుంచీ ఇది మహిళల హక్కుగా వస్తోంది. ఇప్పుడు ఈ హక్కును తొలగించింది. దీనిని రాజ్యంగ హక్కుగా భావించకూడదని తెలిపింది. ఐదు మంది న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం ఈ మేరకు తీర్పు ఇచ్చింది.

ఈ తీర్పు ప్రకారం అబార్షన్ల విషయంలో రాష్ట్రాలు సొంతంగా నిబంధనలను రూపొందించుకోవాల్సి ఉంటుంది. రాష్ట్రాల గవర్నర్లు అబార్షన్లకు అనుమతి ఇచ్చేలా సొంతంగా మార్గదర్శకాలను రూపొందించుకోవచ్చని తెలిపింది. దీనిపై తుది నిర్ణయాన్ని ప్రజలు, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలే తీసుకోవాలని చెప్పింది. ఈ తీర్పును అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వ్యతిరేకించారు. ఇది తనను తీవ్రంగా కలచి వేసిందని వ్యాఖ్యానించారు. ఈ ఒక్క తీర్పుతో దేశం 150 సంవత్సరాలు వెనక్కి వెళ్లిపోయినట్టనిపిస్తోందని మండిపడ్డారు.

మరోవైపు.. ఈ తీర్పు పట్ల ఉద్యమకారులు హర్షం వ్యక్తం చేశారు. యాంటీ అబార్షన్ మూమెంట్ ప్రతినిధులు పెద్ద ఎత్తున వీధుల్లోకి వచ్చి ఆనందోత్సాహాలు చేపట్టారు. ఒకరికొకరు అభినందనలు తెలుపుకొన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగం చేయొద్దంటూ డిమాండ్ చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..