అమెరికాలో అదిరిపోయే ఆఫర్లు.. బంపర్ ప్రైజులు. అదేదో మాల్స్ లోనో, షాపింగ్ సెంటర్లలోనో అనుకునేరు.. వ్యాక్సిన్ సెంటర్లలో. అదేంటి అనుకుంటున్నారా? అవును మరి.. అమెరికాలో టీకా వేసుకుంటే గంజాయి మొక్కలు ఫ్రీగా ఇస్తున్నారు. వాషింగ్టన్‌లో 54 శాతం మంది మాత్రమే వ్యాక్సిన్ తీసుకున్నారట. ఈ క్రమంలోనే వ్యాక్సినేషన్ రేట్ పెంచడానికి గత నెలలో ‘సిక్స్ వీక్ విండో’లో తమ టీకా స్వీకరిస్తే అడల్ట్స్‌కు బార్లలో ఒక ఉచిత ఆల్కహాల్ డ్రింక్స్ ఇస్తామని ప్రకటించింది.
తాజాగా యూఎస్ స్టేట్ ఆఫ్ వాషింగ్టన్ జాయింట్స్ ఫర్ జబ్స్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా 21 ఏళ్లు దాటిన వారు టీకా వేయించుకున్నట్లయితే..వారికి గంజాయి మొక్కలను అందిస్తున్నారు. స్టేట్ లిక్కర్ అండ్ గంజాయి బోర్డ్ లైసెన్స్ పొందిన అవుట్‌లెట్‌లలో జూలై 12లోపు వ్యాక్సిన్ తీసుకున్న 21 ఏళ్లు పైబడిన వారికి ప్రీ-రోల్డ్ జాయింట్ అందిస్తారు. దేశ స్వాతంత్ర్య దినోత్సవం జూలై 4 నాటికి కనీసం 70 శాతం అమెరికన్ అడల్ట్స్‌కు టీకాలు వేయాలని యుఎస్ అధ్యక్షుడు జో బిడెన్ లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే, తాజా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ డేటా ప్రకారం ప్రస్తుత సంఖ్య 63.7 శాతంగా ఉంది. ఇక కాలిఫోర్నియా, ఒహియోలలో నగదు బహుమతులు, కళాశాల స్కాలర్‌షిప్‌లు అందించే టీకా ‘లాటరీలను’ నిర్వహిస్తున్నాయి.
Also Read:
ఖడ్గమృగంపై దాడికి పులి యత్నం.. అంతలోనే ఊహించని ట్విస్ట్.. బెంగాల్ టైగర్ పరుగో పరుగు.!
అక్కడి పండ్లు తిన్నారో బీమారీ గ్యారంటీ.! కొనాలంటేనే భయపడుతున్న ప్రజలు.!!
ఒకే కాన్పులో 10 మందికి జన్మనిచ్చిన మహిళ.? అసలు నిజమెంత.! వెలుగులోకి కొత్త ట్విస్ట్..