ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లోని అమెరికా రాయబార కార్యాలయంపై వందలాది ఇరాన్ అనుకూల మిలీషియా సభ్యులు చేసిన దాడిని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీవ్రంగా ఖండించారు. ఇందుకు ఇరాన్‌దే బాధ్యత అని మండిపడ్డారు. ‘‘ఇరాన్ అనుకూల సభ్యులు అమెరికా కాంట్రాక్టర్‌నొకరిని హతమార్చారని, అనేకమందిని గాయపరిచారని ఆయన అన్నారు. ఈ దాడికి పూర్తిగా వారిదే బాధ్యత. దీనికి తీవ్ర పరిణామాలను వారు ఎదుర్కోవలసి ఉంటుంది’’ అని పేర్కొన్నారు. ఇరాన్ మిలీషియా సభ్యుల ఎటాక్ ను ఎదుర్కోలేక అనేకమంది అమెరికన్ సైనికులు ఎత్తయిన బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ గల భవనాన్ని ఎక్కి తలదాచుకున్నారు.
వారు కాల్పులు జరిపినా, బాష్పవాయువు ప్రయోగించినా ఇరాన్ సభ్యులు బెదరలేదు. గేట్లను ఎక్కి వారిపై దాడికి యత్నించారు. ఆందోళనకారుల్లో కొందరు నిప్పు పెట్టడంతో అమెరికన్ ఎంబసీ భవనం కాంపౌండ్‌లో మంటలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి.
ఇరాన్‌లో ఆదివారం రాత్రి కతాయెక్ హిజ్ బుల్లా స్థావరాలపై అమెరికా జరిపిన వైమానిక దాడుల్లో 25 మందికి పైగా మరణించారు. దీనికి ప్రతీకారంగా బాగ్దాద్‌లోని అమెరికా ఎంబసీని టార్గెట్‌గా చేసుకుని ఇరాన్ మిలిషియా సభ్యులు దాడులకు పాల్పడ్డారు.
In front of the #US Embassy in #Baghdad. #IraqProtests pic.twitter.com/d2rTxm44aZ
— Raveen Aujmaya (@raveenaujmaya) December 31, 2019