Joe Biden to visit India: ఆమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భారత్‌తో 4 రోజుల పాటు పర్యటించనున్నారు. ఈ మేరకు అమెరికా వైట్‌హౌస్ జాతీయ భద్రతా సలహాదారు జేక్ సల్లివన్ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఆ ప్రకటన ప్రకారం జీ20 20 దేశాల మధ్య జరిగే శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సెప్టెంబర్ 7 నుంచి 10వ తేదీల్లో భారత్‌లో పర్యటిస్తారు. ఈ సందర్భంగా ఆయన భారత్‌తో ద్వైపాక్షిక సమావేశాలను కూడా జరుపుతారని సల్లివన్ తెలిపారు. అయితే దాని గురించి..
Ad
PM Modi and US President Joe Biden
Follow us on
Joe Biden to visit India: జీ20 దేశాల అధ్యక్ష బాధ్యతలను భారత్ నిర్వర్తిస్తొన్న సంగతి తెలిసిందే. భారత్ నేతృత్వాన సెప్టెంబర్‌లో మన దేశంలోనే జీ20 దేశాధినేతల సమావేశం జరగనుంది. ఈ నేపథ్యంలోనే ఆమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భారత్‌తో 4 రోజుల పాటు పర్యటించనున్నారు. ఈ మేరకు అమెరికా వైట్‌హౌస్ జాతీయ భద్రతా సలహాదారు జేక్ సల్లివన్ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఆ ప్రకటన ప్రకారం జీ20 20 దేశాల మధ్య జరిగే శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సెప్టెంబర్ 7 నుంచి 10వ తేదీల్లో భారత్‌లో పర్యటిస్తారు. ఈ సందర్భంగా ఆయన భారత్‌తో ద్వైపాక్షిక సమావేశాలను కూడా జరుపుతారని సల్లివన్ తెలిపారు. అయితే దాని గురించి ఎలాంటి వివరాలను ఇంకా వెల్లడించలేదు. అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ భారత్‌కి రావడం ఇదే తొలి సారి కావడం విశేషం. మరో వైపు 2026లో జీ20 సమ్మిట్‌కు అమెరికా ఆతిథ్యం ఇవ్వనుంది.
US President Joe Biden will visit India from Sept 7-10 to attend a summit of the Group of 20 nations, White House national security adviser Jake Sullivan told a briefing on Tuesday, reports Reuters.
ఇక సెప్టెంబరులో ఇండోనేషియాలో జరిగే ఆసియన్ (ASEAN) సదస్సుకు అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ విడిగా హాజరవుతారని కూడా సల్లివన్ తెలిపారు. జీ20 సమ్మిట్‌లో బైడెన్ బ్యాంకుల ఆధునీకరణ డెవలప్‌మెంట్‌పై ప్రధానంగా చర్చిస్తారని సల్లివన్ వెల్లడించారు.
Breaking ⚡
US President Joe Biden to travel to India from 7-10 September to take part in G-20 Summit schedule in New Delhi
India 🇮🇳 🇺🇸#India is the host of G-20 this year 🔥 pic.twitter.com/FliTg6N5VT
ఇదిలా ఉండగా, జీ20 సమ్మిట్ నేపథ్యంలో సెప్టెంబర్ 8-10 తేదీలను ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించే ప్రతిపాదనకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం ఆమోదం తెలిపినట్లు అధికారులు తెలిపారు. సీఎం ఆమోదించిన ప్రతిపాదన ప్రకారం, న్యూఢిల్లీ పోలీసులు జిల్లా పరిధిలోని బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలతో సహా అన్ని రకాల వాణిజ్య, వ్యాపార సంస్థలు సెప్టెంబర్ 8 నుంచి 10 వరకు మూసివేయబడతాయి.
CM Arvind Kejriwal approves the proposal to declare public holiday from 8th to 10th September in Delhi, in view of the G20 summit. All schools, govt offices including MCD offices will be closed on these dates https://t.co/105HOuR9mQ