టైం మ్యాగజైన్‌పై ఆ ఇద్దరు… టైం పర్సన్ ఆఫ్ ది ఇయర్ ఎవరో తెలుసా… అమెరికాను మారుస్తున్నారు అంటూ క్యాప్షన్…

ప్రపంచ ప్రఖ్యాత టైం మ్యాగజైన్ ప్రతీ ఏటా ప్రకటించే పర్సన్ ఆఫ్ ది ఇయర్‌ను ప్రకటించింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందిన కాబోయే అధ్యక్షుడు, ఉపాధ్యక్షురాలు జో బైడెన్ - కమలా హారిస్ సంయుక్తంగా ఎంపికయ్యారు.

టైం మ్యాగజైన్‌పై ఆ ఇద్దరు... టైం పర్సన్ ఆఫ్ ది ఇయర్ ఎవరో తెలుసా... అమెరికాను మారుస్తున్నారు అంటూ క్యాప్షన్...
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Dec 11, 2020 | 11:38 AM

ప్రపంచ ప్రఖ్యాత టైం మ్యాగజైన్ ప్రతీ ఏటా ప్రకటించే పర్సన్ ఆఫ్ ది ఇయర్‌ను ప్రకటించింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందిన కాబోయే అధ్యక్షుడు, ఉపాధ్యక్షురాలు జో బైడెన్ – కమలా హారిస్ సంయుక్తంగా ఎంపికయ్యారు. వారి ఫోటోతో పర్సన్ ఆఫ్ ది ఇయర్ 2020 కవర్ పేజీగా ఉన్న మ్యాగజైన్‌ను విడుదల చేసింది. అంతే కాకుండా వారు అమెరికా చరిత్రను మారుస్తున్నారు.

పర్సన్ ఆఫ్ ది ఇయర్ రేసులో ఫ్రంట్‌లైన్ హెల్త్‌కేర్ వర్కర్లు, డాక్టర్ ఆంథోనీ ఫౌచీ, అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉన్నారు. వాటిని దాటుకుని బైడెన్ – హారిస్ పర్సన్ ఆఫ్ ది ఇయర్‌గా నిలిచారు. వారిని విజయాన్ని టైం మ్యాగజైన్ ప్రత్యేకంగా ప్రస్తావించింది. కరోనా కాలంలో వైద్యంపై దృష్టి పెట్టినందుకు వీరిని ఈ ఏడాది మేటి వ్యక్తులుగా ఎంపిక చేసినట్లు టైం మ్యాగజైన్ తెలిపింది. కాగా, 1927 నుంచి ఏటా టైం మ్యాగజైన్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ అవార్డులను ప్రకటిస్తోంది.