బిల్‌గేట్స్‌కు టై గ్లోబల్ లైఫ్ టైం అఛీవ్‌మెంట్ అవార్డు… కరోనాపై విజయం పరిశోధనలతోనే సాధ్యం…

పర్యావరణ పరిరక్షణ, విపత్తులను ఎదుర్కోవడం, దాతృత్వాన్ని చూపడంలో ముందుండే ప్రపంచ కుబేరుడు బిల్‌గేట్స్‌కు లైఫ్ టైం అఛీవ్‌మెంట్ అవార్డు వచ్చింది.

బిల్‌గేట్స్‌కు టై గ్లోబల్ లైఫ్ టైం అఛీవ్‌మెంట్ అవార్డు... కరోనాపై విజయం పరిశోధనలతోనే సాధ్యం...
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Dec 11, 2020 | 11:18 AM

పర్యావరణ పరిరక్షణకు, విపత్తులను ఎదుర్కోవడం, దాతృత్వాన్ని చూపడంలో ముందుండే ప్రపంచ కుబేరుడు బిల్‌గేట్స్‌కు లైఫ్ టైం అఛీవ్‌మెంట్ అవార్డు వచ్చింది. టై గ్లోబల్ అనే సంస్థ ఈ పురస్కారాన్ని బిల్‌గేట్స్‌కు డిసెంబర్ 10న ఆన్‌లైన్‌లో ప్రదానం చేసింది. ఈ సందర్భంగా బిల్‌గేట్స్‌ మాట్లాడారు. ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న రోగాలను నయం చేయాలంటే పరిశోధనలు అవసరమని, ప్రయోగాల ద్వారా వ్యాధులను అరికట్టవచ్చని తెలిపారు.

పర్యావరణ పరిరక్షణ, అధిక ఉత్పత్తి, అంతు చిక్కని వ్యాధులను నిర్మూలించాలంటే పరిశోధనలు అవసరమవుతాయని, ఆ దిశగా మైక్రోసాఫ్ట్ కృషి చేస్తుందని అన్నారు. ఇటీవల మరణించిన దేశీయ ఐటీ దిగ్గజం ఎఫ్‌సీ కోహ్లికి ఇదే సదస్సులో లైఫ్‌టైమ్ సర్వీస్ టు ఇండియన్ ఐటీ ఇండస్ట్రీ అవార్డును ప్రకటించారు. ఈ సందర్భంగా టీసీఎస్ మాజీ సీఈఓ రామదొరై మాట్లాడుతూ… భారతదేశాన్ని ఐటీ రంగంలో బలమైన శక్తిగా కోహ్లి తీర్చిదిద్దారని తెలిపారు. అలాగా పలు విభాగాల్లో కృషి చేసిన వారికి టై గ్లోబల్ అవార్డులను ప్రదానం చేసింది.