US President Biden – PM Modi: ప్రధాని మోదీకి ‘సెల్యూట్’ చేసిన అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్.. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా..
G-20 సదస్సు చాలా బంధాలను కలిపాయి. భారత్ విలువ భారీగా పెరిగింది. ప్రపంచ అధినేతులు ప్రధాని మోదీకి ప్రత్యేక గౌరవాన్ని అందించారు. ప్రధాని మోదీ ఈ సదస్సు మొత్తానికి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు. వీటిలో ప్రధాని మోదీకి అగ్రరాజ్యం అధినేత, ప్రెసిడెంట్ బిడెన్ సెల్యూట్ చేస్తున్న ఫోటో మరింత ప్రత్యేకంగా నిలచింది.

కలిసిసాగుదాం.. అభివృద్దిని సాధిద్దాం.. అంటూ G-20 సదస్సు ముగింపు కార్యక్రమంలో కీలక వ్యాఖ్యలు చేశారు ప్రధాని మోదీ. G-20 అధ్యక్ష బాధ్యతలను భారత్ స్వీకరించింది. ఇండోనేషియా అధ్యక్షుడు జొకొ విడొడొ నుంచి PM మోదీ బాధ్యతలను స్వీకరించారు. G-20 అధ్యక్ష బాధ్యతలు తీసుకోవడం చాలా గర్వంగా ఉందన్నారు. ప్రపంచానికి ఈ కూటమి ఓ దిక్సూచిలా పనిచేస్తుందన్నారు. పర్యావరణాన్ని కాపాడడానికి సభ్యదేశాలు అత్యంత ప్రాధాన్యతను ఇస్తాయన్నారు మోదీ. రెండు రోజుల పాటు బిజీ బిజీగా గడిన దేశాధినేతలు.. చివరి రోజు మాత్రం బాలిలోని మడ అడవులను సందర్శించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌లు పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
కాసేపు సరదాగా మాట్లాడున్నారు. ఈ సదస్సులో భాగంగా, బాలిలో 1300 ఎకరాల్లో మడ (మాంగ్రూవ్ చెట్లు) అడవుల్లో వీరు మొక్కలు నాటారు. వాతావరణ మార్పులపై పోరాటంపై సందేశం పంపేందుకు ప్రపంచ నాయకులు మడ మొక్కలను నాటుతున్నట్లు ప్రధాని మోదీ ట్విట్టర్‌లో షేర్ చేసిన ఫోటోలను షేర్ చేశారు.
ఒక ఫోటోలో ఒకటి మాత్రం చాలా ప్రత్యేకంగా నిలిచింది. ఇందులో ప్రధాని మోడీ కూర్చొని ఉంటే.. అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్, అతని ఇండోనేషియా కౌంటర్ జోకో విడోడో తమ గార్డెన్ హూలను పైకెత్తి కెమెరాను చూసి నవ్వుతున్నారు. మరొక ఫోటోలో.. ప్రధానమంత్రి అధ్యక్షుడు జో బైడెన్, ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌లతో సంభాషిస్తున్నట్లు చూడవచ్చు.
ప్రధాని మోడీ మొదట అధ్యక్షుడు బిడెన్ తన వద్దకు రావడాన్ని గమనించలేదు. కానీ కరచాలనం కోసం వేగంగా వచ్చిన బిడెన్ ప్రధాని మోదీని కౌగిలించుకున్నారు. ప్రెసిడెంట్ బిడెన్ తన సీటుకు వెళుతున్నప్పుడు, PM మోడీ అతనికి నవ్వు తెప్పించే ఏదో చెప్పారు.
అయితే ఈ ఫోటోల్లో మరొకటి కూడా చాలా స్పెషల్‌గా నిలిచింది. వీటిలో ప్రధాని మోదీకి అగ్రరాజ్యం అధినేత, ప్రెసిడెంట్ బిడెన్ సెల్యూట్ చేస్తున్న ఫోటో మరింత ప్రత్యేకంగా నిలచింది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం