
ఇరాన్ యుద్ధానికి నిరసనగా రాజీనామా చేయడం, అమెరికా అధికారి జోసెఫ్ అలియాస్ జో కెంట్ మరింత చిక్కుల్లో పడ్డారు. ఉగ్రవాద నిరోధక విభాగం మాజీ అధిపతి అయిన జో కెంట్‌పై ట్రంప్ ప్రభుత్వం విచారణ ప్రారంభించింది. గూఢచార సమాచారాన్ని లీక్ చేశారన్న ఆరోపణలు ఆయనపై మోపింది ట్రంప్ సర్కార్. అమెరికాలో దీనిని దేశద్రోహంగా పరిగణిస్తారు. ఈ విచారణ అనంతరం, జోను అరెస్టు చేసే అవకాశం ఉంది. ఈలోగా, కెంట్ తన కొత్త వాదనతో ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించారు.
ప్రముఖ యూట్యూబర్ టర్కర్ కార్ల్సన్‌తో ఒక ఇంటర్వ్యూలో, 2025 వరకు ఇరాన్ వద్ద అణ్వాయుధాలు కలిగిన యురేనియం లేదని జో కెంట్ పేర్కొన్నారు. 2004 నుండి ఇరాన్ అణ్వాయుధాలను అభివృద్ధి చేయడానికి ఎటువంటి ముఖ్యమైన ప్రయత్నాలు చేయలేదన్నారు. ఈ వ్యాఖ్యలు ప్రపంచ వ్యాప్తంగా పెద్ద దుమారం రేపుతోంది. అయితే తాజాగా ఫాక్స్ న్యూస్ కథనం ప్రకారం, ట్రంప్ ప్రభుత్వం సిఫార్సు ఆధారంగా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI) జో కెంట్‌పై దర్యాప్తు ప్రారంభించింది. యుద్ధ సమయంలో అమెరికా భద్రతకు కీలకమైన గూఢచార సమాచారాన్ని లీక్ చేశారనే ఆరోపణలను జో కెంట్ ఎదుర్కొంటున్నారు.
యునైటెడ్ స్టేట్స్‌లో గూఢచార సమాచారాన్ని లీక్ చేయడం ఒక తీవ్రమైన నేరంగా పరిగణిస్తారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై యూఎస్ గూఢచర్య చట్టం (1917) కింద విచారణ జరుపుతారు. నేరం రుజువైతే, వారికి 10-20 సంవత్సరాల జైలు శిక్ష పడవచ్చు. చాలా సందర్భాలలో, యావజ్జీవ కారాగార శిక్ష కూడా విధించవచ్చు.
కెంట్ ఏ సమాచారాన్ని లీక్ చేశాడు?
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..