Watch Video: అమెరికా గగనతలంలో చైనా స్పై బెలూన్‌.. అగ్రరాజ్యం ఎలా పేల్చివేసిందో తెలుసా.. షాకింగ్ వీడియో

|

Feb 09, 2023 | 12:28 PM

అమెరికా గగనతంలో చైనాకు సంబంధించిన స్పై బెలూన్.. అంతర్జాతీయంగా డ్రాగన్ కంట్రీ కుట్రను మరోసారి బట్టబయలు చేసింది. అమెరికా గగనతలంపై..

Watch Video: అమెరికా గగనతలంలో చైనా స్పై బెలూన్‌.. అగ్రరాజ్యం ఎలా పేల్చివేసిందో తెలుసా.. షాకింగ్ వీడియో
China Spy Balloon
Follow us on

అమెరికా గగనతంలో చైనాకు సంబంధించిన స్పై బెలూన్.. అంతర్జాతీయంగా డ్రాగన్ కంట్రీ కుట్రను మరోసారి బట్టబయలు చేసింది. అమెరికా గగనతలంపై ఎగురుతున్న చైనా నిఘా బెలూన్‌ను అగ్రరాజ్యం అమెరికా ఫైటర్ జెట్‌తో కూల్చివేసింది. అప్పటినుంచి ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అట్లాంటిక్ మహాసముద్రంలోని దక్షిణ కరోలినా తీరంలో చైనా నిఘా బెలూన్‌ను గుర్తించిన అమెరికా.. దాదాపు నాలుగు రోజుల పాటు నిశితంగా పరిశీలించింది. దానిని ఫిబ్రవరి 4న ఎట్టకేలకు కూల్చివేసింది. గగనతలంపై అత్యాధునిక F-22 Raptor జెట్ ఫైటర్లను మోహరించిన అగ్రరాజ్యం.. బెలూన్‌ను పేల్చివేసే దృశ్యాలన్నింటిని రికార్డు చేసింది. ఇప్పుడు దానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

శత్రువులను గడగడలాడించే అత్యాధునిక జెట్ ఫైటర్.. లక్ష్యం వైపు ఎలా దూసుకెళ్లింది.. చివరికి బెలూన్‌ను ధ్వంసం చేసిన విధానాన్ని దానిలో చూపించారు. బెలూన్ దాదాపు 200 ft (60m) పొడవుగా ఉన్నట్లు US అధికారులు పేర్కొన్నారు. పేలోడ్ భాగం ప్రాంతీయ విమానాలతో పోల్చదగినదని.. కొన్ని వేల పౌండ్ల బరువు ఉంటుందని తెలిపారు.

ఇవి కూడా చదవండి

వీడియో చూడండి..

తమ రక్షణస్థావరాలపై చైనా నిఘాపెడుతున్నట్లు అనుమానం వ్యక్తం చేసిన అమెరికా.. తమ జోలికొస్తే.. ఎవర్నీ వదిలిపెట్టమంటూ డ్రాగన్ కంట్రీని హెచ్చరించింది. ఐదు ఖండాలలో ఉన్న విస్తృత నౌకాదళాలను దాటి అనుమానిత చైనీస్ నిఘా బెలూన్ తమ భూభాగంలోకి వచ్చిందని అమెరికా పేర్కొంది.

చైనా ఏకైక లక్ష్యం యునైటెడ్ స్టేట్స్ కాదు, ప్రపంచం మొత్తం అని విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్ తెలిపారు. బెలూన్ శిధిలాల నుంచి సేకరించిన సమాచారాన్ని అమెరికా ఇతర దేశాలతో పంచుకున్నట్లు ఆయన తెలిపారు. మొత్తం 40 మిత్ర దేశాలతో ఈ సమాచారాన్ని పంచుకున్న అమెరికా.. భారత్, జపాన్ సహా పలు దేశాలను బెలూన్ ద్వారా టార్గెట్ చేసినట్లు వివరించారు. దౌత్యపరమైన సంక్షోభాన్ని సృష్టించేందుకే ఇలా చేస్తున్నట్లు తెలిపింది.

ఇదిలాఉంటే.. బెలూన్‌ను గూఢచర్యం కోసం ఉపయోగించామన్న విషయాన్ని చైనా ఖండించింది. ఇది వాతావరణ పరికరమని.. అది దారి తప్పినట్లు పేర్కొంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం..